చూశావా జగన్... 'పట్టిసీమ' పవర్.. ఎల్ నినోను ఎలా అడ్డుకుందో..?!

కృష్ణా డెల్టా ఎత్తిపోతలకు జలహారతి ఇచ్చిన మంత్రి నిమ్మల మాటలు ఎలా ఉన్నాయంటే..


రుతుపవనాలు మందగించాయి. దీనికి కారణం ఎల్ నినో ( El Niño) పంజా విసరడమే. వర్షాభావం వల్ల దుర్భిక్ష పరిస్థితికి దారితీసింది. ఇది రాయలసీమకే పరిమితం కాలేదు. అన్నపూర్ణగా నిలిచే నిలిచే జిల్లాలపై పంజా విసిరింది. కృష్ణా బేసిన్ లోని ప్రాంతంపై పంజా విసిరింది. ఈ పరిస్థితుల్లో రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా, వార్తల్లో ప్రముఖంగా నిలిచిన పట్టిసీమ ఎత్తిపోతలు కృష్ణా డెల్టాను ఆదుకున్నాయి.

ఎల్ నినో ప్రభావం వల్ల ప్రాజెక్టుల్లో ఉన్న నీరు ఆవిరయ్యే ప్రమాదం ఏర్పడింది. దీంతో కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రధాన జలాశయాలన్నీ అడుగంటిపోవడంతో కృష్ణా డెల్టా ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. ఎగువ నుంచి వస్తున్న గోదావరి వరద నీరు వృథాగా సముద్రంలో కలవకుండా కృష్ణా నదికి తరలించేందుకు వీలుగా నిర్మించిన పట్టిసీమ ఆదుకుంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లు ఆన్ చేసి కృష్ణా డెల్టాకు మళ్లీ ఊపిరి పోశారు.

రాష్ట్ర విభజన తరువాత 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భావించారు పోలవరం ప్రాజెక్టుకు ముందే పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఇది టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్ నడిచింది.
"పట్టిసీమ కాదు అది ఒట్టి సీమ" అని అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ టీడీపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. కానీ,
రాయలసీమకు ప్రధానంగా రాష్ట్రానికి "ఎల్ నినో" ప్రభావం ఏమిటనేది తెలియదు. వైసీపీ చీఫ్ వైఎస్. జగన్, ఆ పార్టీ నేతలు టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

రూ. 1,300 కోట్ల పెట్టుబడితో..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి దూరదృష్టి ఉన్నప్పటికీ భవిష్యత్తును అది కూడా క్షామ పరిస్థితులను ఊహించలేదు. కృష్ణా డెల్టతో పాటు రాయలసీమకు సేద్యపునీటి రంగంలో మేలు చేయాలనే లక్ష్యంగా 1,300 కోట్ల రూపాయలతో రికార్డు సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేశారు. అదే ప్రస్తుతం ఎల్ నినో దుర్భిక్షం ఏర్పడే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో పట్టిసీమతో కృష్ణా డెల్టాకు జీవం పోశారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏమన్నారంటే..
"దూరదృష్టితో నిర్మించిన పట్టిసీమ ఎత్తపోతల పథకం వ్యవసాయ రంగానికి వెన్నుదున్నుగా నిలిచింది" అని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ద్వారా రికార్డు స్థాయిలో 442 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విజయవంతంగా మళ్లించామని ఆయన చెప్పారు.
"ఆ ప్రాంతాల్లో పంటలు సమృద్ధిగా పండి, ఏకంగా రూ. 50 వేల కోట్లకు పైగా సంపద, ఆదాయం సృష్టించాం" అని కూడా ఆయన చెప్పారు.
2026లో అంటే ప్రస్తుతం 'సూపర్ ఎల్ నినో' వస్తుందని ఊహించలేదు. ఈ పరిస్థితి, ప్రభావాలు ముందస్తుగానే సీఎం చంద్రబాబు అంచనా వేశారో? లేదో? తెలియదు. ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలనే ఆయన సంకల్పం నెరవేరింది" అని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు.

గోదావరి జలాలకు ఘనంగా 'జలహారతి'

పట్టిసీమ డెలివరీ పాయింట్, తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పునఃప్రారంభం సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జలాలకు ఘనంగా ‘జలహారతి’ ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
" పట్టిసీమ ప్రాజెక్టుపై గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పట్టిసీమ కాదు.. ఒట్టిసీమ అని ఎద్దేవా చేయడమే కాకుండా, ఇందులో భారీ అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేశారు" ఇప్పుడు సమాధానం చెప్పగలరా? అని మంత్రి నిమ్మల ప్రశ్నించారు.
"కేవలం రాజకీయ విద్వేషం, ముందుచూపు లేకపోవడం వల్లే గత ఐదేళ్ల జగన్ పాలనలో పట్టిసీమ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. నేడు కృష్ణా డెల్టాకు కరువు ముంచుకొస్తున్న వేళ మళ్లీ ఇదే పట్టిసీమ నీళ్లే దిక్కయ్యాయి. మరి ఇప్పుడు జగన్ ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారు?" అని మంత్రి నిమ్మల నిలదీశారు.
Read More
Next Story