100 ఏళ్ల క్రితం తిరుమల కొండ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా మారింది.?
తిరుమలలో బ్రహ్మోత్సవాల వేళ 1980ల నాటి తిరుమల అరుదైన ఫోటో గ్యాలరీ.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమలలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ పవిత్ర వేడుకల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో గ్యాలరీ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
నాటి జ్ఞాపకాలను నేటి తరానికి పరిచయం చేసేలా టీటీడీ ఈ గ్యాలరీని అద్భుతంగా తీర్చిదిద్దింది.
ముఖ్యంగా 1980లలో తిరుమల వాతావరణం ఏ విధంగా ఉండేది? అప్పట్లో శ్రీవారి దర్శన క్యూ లైన్లు, వరాహ స్వామి ఆలయ ప్రాంతం, అలాగే శ్రీవారి మాడ విధులు ఎంత ప్రశాంతంగా, భక్తిభావంతో సాగిపోయేవి అనే విషయాలను కళ్లకు కట్టేలా అరుదైన ఫోటోలను ఇందులో ప్రదర్శించారు. నేటి ఆధునిక తిరుమలకు, నాటి పవిత్ర రూపానికి మధ్య ఉన్న తేడాలను ఈ గ్యాలరీ స్పష్టంగా చూపుతోంది.
శతాబ్దాల చరిత్ర కలిగిన తిరుమల క్షేత్రం గడచిన దశాబ్దాలలో ఎలా రూపాంతరం చెందిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
పూర్తి వివరాలు మరియు ఆసక్తికరమైన ఆ దృశ్యాలను చూసేందుకు ఈ పూర్తి వీడియోను చూడండి
Next Story

