
SHAR | నింగిలో 'అన్వేష' ఉపగ్రహం ఎలా దారి తప్పింది ?
శ్రీహరికోటలో PSLV సిరీస్ లో రెండో వైఫల్యం.
నింగిలోకి దూసుకువెళుతూ దారితప్పిన రాకెట్ "అన్వేష" కోసం ఇస్రో శాస్ర్తవేత్తలు అన్వేషణ ప్రారంభించారు. శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధనా, ప్రయోగ కేంద్రం నుంచి సోమవారం ఉదయం ప్రయోగించిన రాకెట్ కక్ష్యలోకి చేరలేదు. భూ పరిశీలన, సరిహద్దుల్లో నిఘాతో పాటు విదేశీ ఉపగ్రహాలు EOS-N1 తో సహా ఉపగ్రహాలను నింగిలోకి మోసుకుని వెళ్లిన PSLV C-62 కంట్రోల్ సెంటర్ నుంచి సంబంధాలు తెగిపోయాయి.
"నాలుగో దశలో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల విఫలమైన తీరుపై డేటా విశ్లేషిస్తున్నాం" అని ఇస్రో చైర్మన్ వి నారాయణ వెల్లడించారు.
30 సంవత్సరాల చరిత్రలో PSLV రాకెట్ రెండోసారి విఫలమైనట్లు ఇస్రో చరిత్రలో నమోదైంది. గత ఏడాది మే నెలలో EOS-09 ఉపగ్రహాలు నింగిలోకి మోసుకుని వెళ్లిన PSLV C-61 ఉపగ్రహ వాహకనౌక కూడా మూడో దశలోనే విఫలమైంది.
శ్రీహరికోట నుంచి నింగిలోకి పంపించే రాకెట్లలో PSLV C-61 రకం వాహక నౌకల వైఫల్యాలపై అధ్యయనం చేయడానికి ఇస్రో అధ్యయనం చేయడానికి ఫెయిల్యూర్ అనాలసిస్ కమిటీ ( Failure Analysis Committee FAC) ఏర్పాటు చేస్తుంది. ఆ తరువాత జరిగే ఉపగ్రహ ప్రయోగాల్లో లోటుపాట్లు సరిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతాయనేది షార్ శాస్త్రవేత్తలు చెప్పిన సమాచారం. తాజాగా సోమవారం జరిగిన ప్రయోగం విఫలం కావడం వెనుక PSLV C-61 రాకెట్లలో డేటా విశ్లేషణ తరువాత ఎలాంటి లోపాలు గుర్తించారనేది ఇస్రో వెల్లడించలేదు.
"రాకెట్ మోటార్లలో పీడన శక్తి తగ్గడమే కారణం" అని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ చెప్పారు.
శ్రీహరికోట నుంచి సోమవారం ఉదయం ప్రయోగించిన PSLV C-62 మిషన్ లో ప్రధాన పేలోడ్ థాయిలాండ్, యునైటెడ్ కింగ్ డం (United Kingdom) సంయుక్తంగా అభివృద్ధి చేసిన థియోస్ 2 అనే భూ పరిశీలన ఉపగ్రహం, నేపాల్, భారత్ సాంకేతికకు తోడు స్పానిష్ స్టార్టప్ కంపెనీలు అభివద్ధి చేసిన రీ ఎంట్రీ క్యాప్లూల్స్ తోపాటు 14 ఇతర ఉపగ్రహాలు ఉన్నాయి.
నాలుగో దశలో విఫలం..
శ్రీహరికోట నుంచి సోమవారం ప్రయోగించిన PSLV C-62 రాకెట్ అన్వేష మూడుదశల్లో సవ్యంగా ప్రయాణించింది. నాలుగో దశలో కంట్రోల్ రూమ్ తో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఉపగ్రహ వాహకనౌక ప్రయోగం 18 నిమిషాల్లో పూర్తి కావాల్సి ఉంది. సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ సంవత్సరం ప్రారంభంలోని వైఫల్యం నమోదయింది.
శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సోమవారం ఉదయం 10 గంటల 17 నిమిషాల 30 సెకండ్లకు PSLV C-62 ఉపగ్రహ వాహక నౌక Eos-N1కు అన్వేష గా ఇస్రో పేరు పెట్టింది. భూమి ఉపరితలాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించడం, సరిహద్దుల్లో పర్యవేక్షణ, దేశ భద్రతా వ్యవస్థకు వ్యూహాత్మక నిఘా కార్యకలాపాల కోసం ప్రధానంగా రక్షణ, విపత్తు నిర్వహణ రంగాల్లో కీలక పాత్ర పోషించే హై పవర్ స్పెక్ట్రల్ ఈవో ఎస్ ఎన్ వన్ ఉపగ్రహ వాహక నౌకను ఇస్రో సిద్ధం చేసింది.
ప్రత్యేకతలు ఏమిటి అంటే 1,485 కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహానికి మరో పదవి చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే ప్రయత్నం జరిగింది. ఈ చిన్న ఉపగ్రహాల్లో దేశంలోని మూడు స్టార్టప్ కంపెనీని చెందినవి 7 ఉపగ్రహాలు, విదేశాలకు చెందిన ఎనిమిది చిన్నపాటి ఉపగ్రహాలు ఉన్నాయి. పూర్తిస్థాయి వాణిజ్యపరంగా వీటిని న్యూస్ స్పేస్ ఇండియా లిమిటెడ్ పర్యవేక్షణలో ప్రయోగించారు.
ఏమి జరిగింది
శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పిఎస్ఎల్వీసీ 62 మిషన్ ఉదయం 10. 17 నిమిషాలకు నిప్పులు చెరుగుతూ గగనతలంలోకి దూసుకుపోయింది. ఈ రాకెట్ 18 నిమిషాల తరువాత నిర్ణీత కక్ష్యలోకి చేరుకోవాలి. మూడు దశల్లో రాకెట్ సజావుగానే నింగిలోకి ప్రవేశించింది. నాలుగో దశలో గ్రౌండ్ కంట్రోల్ కంట్రోల్ రూమ్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఈ సంవత్సరం ప్రయోగించిన తొలి వాణిజ్య ఉపగ్రహ వాహక నౌక పీఎస్ఎల్వీ సి 62 విఫలమైనట్లు ప్రకటించారు.
"ప్రయోగంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఈ ప్రయోగం ఎందుకు విఫలమైందనే అంశంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే ఖచ్చితమైన కారణాలను వెల్లడిస్తాం" అని ఇస్రో చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
భారత రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (Drdo) PSLV C-62 Eos-N1 వాహకనౌకను అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందించింది. దేశ రక్షణలో కీలక సమాచారం అందిస్తుందని భావించిన ఈ ఉపగ్రహ వాహకనౌక గూఢచారి ఉపగ్రహాల కుటుంబంలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఇందులో ఉంది.
PSLV సిరీస్ వాహకనౌకల వైఫల్యం
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి పంపిన PSLV సిరీస్ వాహక నౌకలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినవి కావడం గమనించదగ్గ విషయం. వీటిల్లో చాలావరకు వైఫల్యాలే నమోదైనట్లు గత ప్రయోగాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది.
2026 జనవరి 12 ఉదయం 10:18 నిమిషాలకు PSLV62 Eos-N1 అన్వేష ఉపగ్రహ వాహక నౌక ప్రయోగంలో మొదటి రెండు దశల్లో సవ్యంగా సాగింది. మూడో దశలోకి రాకెట్ భూ స్థిర కక్షలోకి వెళ్ళడానికి ముందు సాంకేతికంగా సమస్యలు ఎదురయ్యాయి.
శ్రీహరికోట కంట్రోల్ లో ఇస్రో చైర్మన్ నారాయణ శాస్త్రవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ,
"మూడో దశ చివరి వరకు ఉపగ్రహ వాహక నౌక పనితీరు వహించిన విధంగానే జరిగింది. నాలుగో దశలో భూస్థిర కక్షలోకి వెళ్లే ముందు సంబంధాలు తెగిపోవడం విచారకరం. వైఫల్యానికి కారణాలు ఏంటి అనేది డేటా విశ్లేషిద్దాం" అని అధికారికంగా ప్రకటించారు.
2025 మే 18: శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సి 61/ Eos 09 ఇస్రో 101 రాకెట్ ప్రయోగం చేసింది. నింగిలోకి తీసుకువెళ్లిన 12 నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ఈ ప్రయోగం విఫలమైంది
2022 ఆగస్టు 7: స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (Sslv) తొలి ప్రయోగం కూడా విఫలమైంది. మూడు దశలు సవ్యంగా లింగిలోకి దూసుకువెళ్లిన ఈ ఉపగ్రహ వాహక నౌక వృత్తాకార కక్షకు బదులు.. దీర్ఘ వృత్తాకారక్షలో వెళ్లడం వల్ల ఈ ప్రయోగం కూడా విఫలం చెందింది
2021 ఆగస్టు 12: శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన జి ఎస్ ఎల్ వి F10 ఈఓఎస్ 03 మిషన్ కూడా విఫలమైంది. ఈ క్రయోజనిక్ రాకెట్లు అమర్చిన మోటార్లు సరైన సమయంలో పనిచేయని కారణంగా విఫలమైనట్టు అప్పట్లో ప్రకటించారు.
2017 ఆగస్ట్ 31: పి ఎస్ ఎల్ వి సి 39 Irnss-1 H నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగం కూడా విఫలమైంది. ఈ ఉపగ్రహ వాహకనౌక నింగిలోకి తీసుకువెళ్లిన తర్వాత హాట్ షీల్డ్ విడిపోవడంలో జరిగిన లోపం వల్ల ఈ ఉపగ్రహం నిర్ణీత కక్షలోకి చేరుకులేని స్థితిలో విఫలమైంది.
Next Story

