ఘంటసాల సినిమాకు వినోదపు పన్ను రాయితీ ఇవ్వాలి
x

ఘంటసాల సినిమాకు వినోదపు పన్ను రాయితీ ఇవ్వాలి



తెలుగువారు మరచిపోలేని మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పేరుపై నిర్మించిన సినిమాపై వినోదపు పన్ను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఘంటసాల సినిమాను సిహెచ్ రామారావు నిర్మించగా, అత్యంత సామాన్యుడైన సిహెచ్ పవన్ అనే వ్యక్తి ఘంటసాల పై ఉన్న అభిమానంతో తన రిటైర్మెంట్ డబ్బులు వెచ్చించి సినిమాను అద్భుతంగా తీశారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సినిమాను రిలీజ్ చేయడానికి కూడా నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని ఇలాంటి సినిమాలను ప్రభుత్వమే బాధ్యత తీసుకొని విడుదల చేయాలని కోరారు.పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఐదు భాషలలో తన మధుర కంఠాన్ని వినిపించారని అలాంటి గాయకుడి పై తీసిన చిత్రం విడుదలకు నోచుకోకపోవడం సమంజసం కాదని, ఆయనకున్న గౌరవాన్ని కాపాడాలని, తెలుగువారు ప్రతినిత్యం స్మరించుకునే వ్యక్తి ఘంటసాల అని ఆయన గుర్తు చేశారు.ఘంటసాల పాడిన పాటలు ప్రతినిత్యం తిరుమల కొండపై మార్మోగు తుంటాయని టీటీడీ ఆస్థాన గాయకుడిగా పనిచేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు చిత్రానికి టీటీడీ లాంటి సంస్థలు తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Read More
Next Story