
వచ్బే ఏడాది బాబు దావోస్ పర్యటన ఖరారు
సీఎం చంద్రబాబుతో పాటు బృందంలో మంత్రి నారా లోకేష్ కూడా ప్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన చేపట్టనున్నారు. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దావోస్ పర్యటన చేయనున్నారు. దావోస్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సుకు హాజరు కానున్నారు. ఖ్యమంత్రి వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ కూడా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొనడంతో పాటుగా పలువురు పారిశ్రామికవేత్తలను కలిసి ఏపీకి కావాల్సిన పెట్టుబడుల గురించి చర్చంచనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి బృందం ఆంధ్రప్రదేశ్ "బ్రాండ్ ఇమేజ్"ను అంతర్జాతీయ వేదికపై బలంగా నిలపడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యాంగా పర్యటించనున్నారు. ఆ మేరకు అధికారిక షెడ్యూల్ కూడా ఖరారైంది.
కీలక సంస్థల అధిపతులతో భేటీలు
పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేశ్ ప్రపంచంలోని అనేక అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలు, అధిపతులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనున్నారు. యూనిలీవర్ (Unilever), డీపీ వరల్డ్ గ్రూప్ (DP World Group), పెప్సికో (PepsiCo), గూగుల్ క్లౌడ్ (Google Cloud) (విశాఖలో డిజైన్ సెంటర్ ఏర్పాటుపై చర్చ), సిస్కో (Cisco) (విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు ఆహ్వానం), ఎల్‌జీ కెమ్ లిమిటెడ్ (LG Chem) (ఎనర్జీ, పెట్రోకెమికల్, సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుపై చర్చ), మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ (ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణల రంగంలో సహకారం కోసం) ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ విజన్ ప్రదర్శన చేయనున్నారు.
స్వర్ణాంధ్ర 2047 విజన్ కింద 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే స్వర్ణాంధ్ర 2047 రోడ్‌మ్యాప్‌ను ప్రపంచానికి వివరించడం. వ్యాపార వేగం (Speed of Doing Business) గురించి, ఏపీలో వ్యాపారం చేయడానికి ఉన్న వేగవంతమైన, పారిశ్రామికవేత్తల-స్నేహపూర్వక విధానాలను వివరించడం, మానవ వనరులు (Human Resources) కింద రాష్ట్రంలో ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రభుత్వ రాయితీలను వివరించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొత్తం మీద, ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి, సుస్థిర అభివృద్ధికి ప్రపంచస్థాయి మద్దతును కూడగట్టేందుకు ముఖ్యమైన వేదిక కానుంది.

