
తిరుపతికి సమీపంలోని గొల్లవనిగుంటలో ఆధునిక క్రీడా స్టేడియం.
అంతర్జాతీయ క్రీడా యవనికపై 'తిరుపతి తొలి సంతకం'...
యువగళం యాత్రలో ఇచ్చిన మాట. తిరుపతిలో ఆధునిక క్రీడా స్టేడియం రేపు అంకితం చేయనున్న మంత్రి నారా లోకేష్
తిరుపతి నగరానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కేంద్రం అంతర్జాతీయ క్రీడలకు వేదికగా సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. క్రీడాకారుల శిక్షణకు నిలయంగా మారనున్నది. తద్వారా క్రీడా యవనికపై సరికొత్తగా "తిరుపతి తొలి సంతకం" చేయబోతోంది.
తిరుపతికి సమీపంలోని రూ. 10.10 కోట్లతో గొల్లవానిగుంటలో ఆధునిక క్రీడా స్టేడియం ( Modern Sports Stadium ) నిర్మాణం పూర్తయింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం క్రీడా ప్రపంచానికి అంకితం చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. జిల్లాలోని గూడూరులో 2.25 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ హాల్ నిర్మాణం పూర్తి చేశారు. సూళ్లూరుపేటలో కూడా రూ. 2.75 కోట్లతో అవుట్‌డోర్, ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
"తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ( Tirupati Urban Development Authority Tuda)సహకారంతో ఏపీ క్రీడా పాధికార సంస్థ ద్వారా రూ. 10.10 కోట్ల రూపాయలతో స్టేడియం నిర్మాణం పూర్తి చేశాం" అని శాప్ ( Andhra Pradesh Sports Authority SAAP ) చైర్మన్ రవి నాయుడు చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ CSR-PPP మోడల్ ద్వారా ఈ గ్రౌండ్ నిర్మాణం చేశామని ఆయన వివరించారు.
ఒక్క మాటతో..
2024 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర సాగిస్తున్నారు. కుప్పం నుంచి ఆయన పాదయాత్ర తిరుపతికి చేరింది. విద్యార్థులు, యువకులతో నారా లోకేష్ భేటీ అయ్యారు.
"తిరుపతిలో సరైన క్రికెట్ గ్రౌండ్ లేదు సార్. క్రీడాకారులకు ప్రోత్సాహం లేకుండా పోతోంది" అని ఓ విద్యార్థి లేవనెత్తారు. ఆ రోజు నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంత్రి కాగానే తిరుపతిలో క్రీడా వసతులు రావడానికి బీజం వేశాయని శాప్ చైర్మన్ రవి నాయుడు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడా రంగంపై ప్రత్యేక దృష్టి సారించి, తిరుపతిలో మెరుగైన క్రీడా వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
సీఎం చదివిన బడిలో..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ( Naravaripalle ) అనే విషయం తెలిసిందే. ఈ గ్రామంలో బడి లేకపోవడంతో ఆయన సమీపంలోని శేషాపురంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి చదువుకున్నారు. చంద్రగిరిలోని జెడ్పీ హైస్కూల్ లో చదువుకున్నారు. బాల్యాన్ని గుర్తుకు చేసుకునే సందర్భాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరచూ ఈ విషయాలు గుర్తు చేస్తుంటారు.
చంద్రగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చదువుకున్న జెడ్పీ హైస్కూల్ పై శాప్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక్కడి పాఠశాలలో ఔత్సాహిక క్రీడాకారులను తీర్చిదిద్దడానికి వసతులు కల్పించారు.
"చంద్రగిరి బాయ్స్ హై స్కూల్‌లో రూ. 3.25 కోట్ల వ్యయంతో మల్టీపర్పస్ ఇండోర్ హాల్ ( Multipurpose Indoor Hall ) నిర్మించాం. ఇందులో రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, చెస్, టేబుల్ టెన్నిస్, యోగా, జిమ్ సౌకర్యాలు ఏర్పాటు చేయించాం" అని శాప్ చైర్మన్ రవి నాయుడు వివరించారు.
హాకీకి కేంద్రంగా...
చంద్రగిరి ప్రాంతం ఒకప్పుడు హాకీ క్రీడకు కేంద్రంగా నిలిచింది. అంతర్జాతీయ మ్యాచ్‌లను కూడా నిర్వహించిన ఘనత ఉంది. రెండుసార్లు ఒలింపిక్స్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన రజిని చంద్రగిరిలోనే శిక్షణ తీసుకున్నారు. ఆమెది కూడా చంద్రగిరి నియోవజకవర్గం కావడం గమనార్హం.
"మాజీ ఎమ్మెల్యే నారా రామమూర్తి నాయుడు సేవలను స్మరించుకుంటూ, క్రీడా సంఘాల అభ్యర్థన మేరకు ఆ ఇండోర్ హాల్‌కు శ్రీనారా రామమూర్తి నాయుడు క్రీడా ప్రాంగణం"గా పేరు పెట్టారు. ఆయన హయాంలో మహిళల కబడ్డీ లీగ్ ప్రారంభించడం, ఉమెన్ వరల్డ్ కప్ కూడా సాధించింది.
ఏ ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారంటే..
తిరుపతికి సమీపంలోని గొల్లవానిగుంట వద్ద 10.10 కోట్ల రూపాయలతో నిర్మించిన క్రికెట్ స్టేడియం.
క్రీడాకారుల కోసం అకాడమీ, ప్రజల కోసం వాకింగ్ ట్రాక్.
చంద్రగిరిలో రూ. 3.25 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ హాల్ నిర్మాణం. దీనికి శ్రీనారా రామమూర్తి నాయుడు క్రీడా ప్రాంగణం”గా నామకరణం చేశారు.
తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ రింగ్ నిర్మాణం.
కరణం మల్లేశ్వరి పేరుతో వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ ప్రణాళిక.
గూడూరు, సూళ్లూరుపేటలో క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ.
చంద్రగిరిలో..
చంద్రగిరిలో ఏర్పాటు చేసిన మల్టీపర్సస్ ఇండోర్ స్టేడియలో హాకీ ఫీల్డ్‌తో పాటు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది క్రీడాకారులు వసతికి తగినట్టు అకాడమీ ఏర్పాటు చేశారు.
కరణం మల్లీశ్వరి పేరుతో..
2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ ద్వారా ప్రాతినిధ్యం వహించారు. కాంస్య పతకం సాధించిన మల్లీశ్వరి దేశ ప్రతిష్టను ఇనుమడించారు. శ్రీకాకుళం నుంచి ఆమె ఒలింపిక్స్ స్థాయికి ఎదిగినా, ఆమెది చిత్తూరు జిల్లా తవణంపల్లె. ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా ఆముదాలవలసకు వెళ్లి స్థిరపడ్డారు. ఆమె దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా..
తిరుపతిలోని శ్రీశ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఒలింపిక్ వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లేశ్వరి పేరిట వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు శాప్ చైర్మన్ రవి నాయుడు వెల్లడించారు.
తిరుపతిలోని శ్రీశ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ రింగ్ నిర్మాణం జరుగుతోంది. దీనిని నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
తిరుపతికి వెలుపల..
ఆధ్యాత్మిక నగరంగా తిరుపతి ప్రపంచ చిత్రపటంలో చిరస్థాయిగా నిలిచింది. అదేకోవలో క్రీడా ప్రపంచంలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. వాటితో పాటు ప్రపంచంలో సూళ్లూరుపేటలోని శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం దేశాన్ని అగ్రదేశాల స్థాయిలో నిలిపింది. క్రీడల్లో కూడా గ్రామీణ ప్రాంత యువతకు ప్రోత్సాహం అందించే విధంగా శాప్ ప్రత్యేక శ్రద్ధ తీసుంది.
సూళ్లూరుపేట వద్ద 2.75 కోట్ల రూపాయలతో అవుట్‌డోర్, ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడి పులికాట్ సరస్సులోకి వచ్చే విదేశీ వలస పక్షులను స్వాగతిస్తూ, ఫ్లెమింగో ఫెస్టివల్ (Flamingo Festival) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. దీనికోసం యువతను భాగస్వామ్యం చేయడానికి వీలుగా క్రీడా పోటీలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా శాశ్వతంగా కబడ్డి, ఖోఖో, వాలీబాల్ మైదానాలు కూడా ఏర్పాటుకు శాప్ సిద్ధం చేస్తోంది.
తిరుపతి జిల్లాలోని గూడూరు రైల్వే జంక్షన్. విజయవాడకు తిరుపతి, చెన్నై నుంచి ఈ మార్గంలో మెరుగైన రైల్వే వ్యవస్థ ఉంది. వాటన్నింటిని పరణలోకి తీసుకుని గూడూరు వద్ద కూడా రూ. 2.25 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ హాల్ నిర్మాణం పూర్తి చేసింది.
రాష్ట్రంలో యువశక్తికి పెద్దపీట వేయడం ద్వారా క్రీడల్లో మరింతగా ప్రోత్సాహించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ద్వారా క్రీడా వసతులు కల్పించడానికి చర్యలు తీసుకున్నామని శాప్ చైర్మన్ రవి నాయుడు వివరించారు.
Next Story

