స్పోర్ట్స్ డెస్టినేషన్ తిరుపతి: నగరంలో యువ క్రీడా రత్నాల సంగమం
హోరాహోరీగా సాగుతున్న క్రీడా పోటీలను వివరించే వీడియో కథనం.
తిరుపతి నగరం క్రీడలకు పదును పెట్టే వేదికగా నిలిచింది. అమరావతి ఛాంపియన్‌షిప్–2026 రాష్ట్రస్థాయి నాలుగు రోజుల పోటీలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రీడలకు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ (Asia Book of Records ) లో ఆంధ్రప్రదేశ్ మల్టీ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ నమోదుతో కొత్త రికార్డు సృష్టించింది.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం వల్ల ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అధికారికంగా స్థానం సంపాదించింది" అని శాప్ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు.
క్రీడా గ్రామంగా మారిన తిరుపతి
రెండో రోజు మంగళవారం శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు అనేక క్రీడాలను లాంఛనంగా ప్రారంభించారు.
క్రీడల అభివృద్దికి కేంద్రం అండ
కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలోని క్రీడా మైదానాల అభివృద్ధికి 2025లో రూ.75కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి తెలిపారు. ఈ ఏడాది కూడా సుమారు రూ.200–250 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులను భారీగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్రీడా కోటా రిజర్వేషన్‌ను రెండు నుంచి మూడు శాతానికి పెంచడంతో పాటు, డీఎస్సీ ద్వారా 382 క్రీడా కోటా పోస్టులను భర్తీ చేసి ఉపాధ్యాయ ఉద్యోగాలకు అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.
స్పోర్ట్స్ హబ్ గా తిరుపతి
తిరుపతి అంటే శ్రీవారి దర్శనం గుర్తుకు వచ్చేదని, ఇప్పుడు తిరుపతి అంటే స్పోర్ట్స్ తిరుపతి అంటే స్పోర్ట్స్ హబ్ అనే స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నట్లు SAAP ఛైర్మన్ రవి నాయుడు తెలిపారు. తిరుపతి గొల్లవానికుంటలో క్రీడా ప్రాంగణం, మహిళా విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం, ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్స్ పునరుద్ధరణ, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.


