
టీమిండియాకు రూ.131 కోట్ల నజరానా..
2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు రూ.125 కోట్ల బహుమతి ప్రకటించిన బీసీసీఐ
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన T20 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను భారత్ 96 పరుగుల తేడాతో ఓడించి, ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం (మార్చి 10) టీమ్ ఇండియాకు రూ.131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ విజయంతో భారత్ ICC పురుషుల T20 ప్రపంచ కప్‌ను మూడుసార్లు గెలుచుకున్న తొలి జట్టుగా కూడా నిలిచింది.
"ఈ చారిత్రాత్మ విజయం కోసం శ్రమించిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్టర్లను బోర్డు మరోసారి అభినందిస్తుంది. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను" అని BCCI ఒక మీడియా ప్రకటనలో తెలిపింది. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు.. బీసీసీఐ రూ.125 కోట్ల బహుమతి ప్రకటించింది.
Next Story

