
కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ
కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్
అంతా అనుకున్నట్లుగానే అయింది. ముందుగా వచ్చినట్లుగానే భారత టీ20కి కొత్త కెప్టెన్ గా శ్రేయర్ అయ్యర్ ను ప్రకటించారు. ఇంతకుముందు కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీతో పాటు ఆటగాడుగాను తొలగించారు. గత రెండు సంవత్సరాలుగా సరైన ఫామ్ లేక తడబడుతున్న సూర్యపై వేటు వేశారు. అలాగే, ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లలో జరిగే పర్యటనకు వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 15 సంవత్సరాల 71 రోజుల వయస్సులో అతను జట్టులో చోటు దక్కించుకుని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
1989 నవంబర్ 15న కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టెండూల్కర్ అరంగేట్రం చేసినప్పుడు అతని వయస్సు 16 సంవత్సరాల 205 రోజులు. భారత్ రెండు టీ20ఐల కోసం (జూన్ 26 మరియు 28) ఐర్లాండ్‌కు వెళ్లనుంది, ఆ తర్వాత జూలై 1 నుంచి 11 మధ్య ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్ ఆడనుంది.
శ్రేయస్ పునరాగమనం..
2023 డిసెంబర్ 3న బెంగళూరులో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడిన తర్వాత శ్రేయస్ తొలిసారిగా జాతీయ టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలెక్టర్లు యూకే పర్యటన, జపాన్‌లో జరిగే 2026 ఆసియా క్రీడల కోసం భారత టీ20ఐ జట్లను, అలాగే శ్రీలంక పర్యటనలో రెండు రోజుల మ్యాచ్‌ల కోసం ఇండియా 'ఎ' జట్టును ఎంపిక చేయడానికి ముంబైలో సమావేశమయ్యారు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఆసియా క్రీడలలో టీ20ఐ జట్లకు శ్రేయస్ నాయకత్వం వహించనుండగా, యువ ఎడమచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. ప్రధాన సెలెక్టర్ అగార్కర్ మాట్లాడుతూ.. “తదుపరి ప్రపంచ కప్‌కు మాకు ఇంకాస్త సమయం ఉంది.
కేకేఆర్‌తో ఐపీఎల్ గెలవడం, పీబీకేఎస్‌తో రెండు మంచి సీజన్‌లు ఆడటం వంటి కెప్టెన్సీ ప్రదర్శనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అతను జట్టులో ఎప్పుడూ ఉండేందుకు చాలా దగ్గరగా వచ్చాడు, కానీ స్థానం దక్కించుకోలేకపోయాడు” అని వివిధ పర్యటనల కోసం జట్లను ప్రకటించిన అనంతరం ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియాతో అన్నారు.
ఐపీఎల్‌లో శ్రేయస్ అద్భుతమైన నాయకత్వ లక్షణాలు 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను (కేకేఆర్) టైటిల్‌కు, 2025లో పంజాబ్ కింగ్స్‌ను (పీబీకేఎస్) ఫైనల్‌కు నడిపించడం బ్యాట్‌తో రెండు సీజన్లలో నిలకడగా రాణించడం వంటివి, 2026 టీ20 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్‌ను ఎంపిక చేయడానికి సెలెక్టర్లను ప్రేరేపించాయి.
గత రెండు సీజన్లలో సూర్యకుమార్ ఫామ్ పడిపోవడమే ఆ ముంబై ఆటగాడిని టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించాలనే తమ నిర్ణయానికి కారణమని అగార్కర్ అన్నారు. "గత రెండేళ్ల ఫామ్‌ను చూస్తే, అతను (భారత) కెప్టెన్‌గా బాగా రాణిస్తున్నాడు. మేము దీని గురించి ఎక్కువగా చర్చించుకోలేదు, కానీ ఏదో ఒక దశలో భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి వచ్చింది," అని అగార్కర్ జోడించారు.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 237.30 స్ట్రైక్ రేట్‌తో, ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలతో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న 15 ఏళ్ల సూర్యవంశీకి జట్టులో చోటు ఖాయమని అగార్కర్ అన్నారు. బీహార్ కుర్రాడైన సూర్యవంశీ ఆట గమనాన్ని మార్చగల సామర్థ్యానికి అగార్కర్ ముగ్ధుడయ్యాడు. “అతను ఏమి చేయగలడో మనం చూశాం. (ఐపీఎల్) ప్లేఆఫ్స్‌లో కూడా, అతను దాదాపు ఒంటరిగా తన జట్టును ముందుకు నడిపించడం మనం చూశాం. అధిక ఒత్తిడి ఉన్న వాతావరణంలో బ్యాటింగ్ చేసే ఒక యువ కుర్రాడు ఆట గమనాన్ని మార్చగలడు. ఇది ప్రశంసనీయం” అని మాజీ భారత పేసర్ అన్నారు.
హార్దిక్‌కు విశ్రాంతి..
ఈ నెల చివరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సిరీస్ కోసం భారత వన్డే జట్టులో ఉన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏ జట్టులోనూ చోటు దక్కలేదు. “ముందు వన్డే ప్రపంచ కప్ కూడా ఉన్నందున, హార్దిక్ వన్డే క్రికెట్ ఆడగలడా ఫిట్‌గా ఉంటాడా అని చూడటమే మా ప్రధాన లక్ష్యం.” "ఇది (నితీష్) రెడ్డికి కూడా అవకాశం కల్పిస్తుంది," అని అగార్కర్ అన్నారు. అనుభవజ్ఞుడైన పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లలో పర్యటించనున్నాడు, కానీ వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌లో ఆడనున్నందున ఆసియా క్రీడలకు దూరమవుతాడు.
గాయం కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ మొత్తానికి దూరమైన ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా కూడా భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. శ్రీలంకతో జరిగే రెండు మల్టీ-డే మ్యాచ్‌లలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ఇండియా 'ఎ' జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. దేవదత్ పడిక్కల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా జట్టులో చోటు దక్కింది.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్, శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
ఆసియా క్రీడల భారత జట్టు
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, రాణా, అర్ష్‌దీప్ సోవావ్ సింగ్, బిష్ణోయ్
శ్రీలంకలో మల్టీ-డే మ్యాచ్‌ల కోసం భారత్ A జట్టు
ధ్రువ్ జురెల్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్, సరాంశ్ జైన్, గుర్నూర్ బ్రార్, ఔకిబ్ నబీ, యష్ ఠాకూర్, ఎన్ జగదీషన్
Next Story

