
జీయోహాట్ స్టార్ లైవ్ ఇచ్చిన సంఖ్య ఇది.. (కర్టసీ జీయోహాట్ స్టార్ ఛానల్)
IPL 2026 ఫైనల్ మ్యాచ్ ను ఎన్ని కోట్ల మంది చూశారంటే..
తెలుగు రాష్ట్రాలలో మిన్నంటిన సంబరాలు, భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఒక ఆట కాదు.. అదొక వ్యసనం అని నిరూపించిన అభిమానులు!
ఐపీఎల్-2026 ఫైనల్ మ్యాచ్ ను ఎంతమంది చూశారో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ ను భారతదేశ జనాభాలో సగానికి మించి చూసినట్టు ప్రసార హక్కులు పొందిన జీయోహాట్ స్టార్ లెక్కలు చెబుతున్నాయి.
మ్యాచ్ గెలిచిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో సంబరాలు మిన్నంటాయి. పెద్దఎత్తున బాణాసంచా పేల్చి వీధుల్లో ర్యాలీ చేశారు. హైదరాబాద్ లో అయితే అర్థరాత్రి వీధులన్నీ క్రికెట్ సంబరాలతో మార్మోగాయి. విరాట్ కోహ్లీ జిందాబాద్, ఆర్సీబీ జిందాబాద్ అంటూ ఊరేగింపులు జరిగాయి.
భారత దేశ జనాభా అనధికారికంగా 135 కోట్లు అనుకుంటే అందులో పిల్లల్ని, క్రికెట్ అంటే ఆసక్తి లేని వాళ్లను తీసేస్తే మిగిలిన జనాభా ఓ 70,80 కోట్లో అనుకుంటే అందులో సగానికి పైగా జనం టీవీల ముందు కూర్చుని ఈ మ్యాచ్ ఆస్వాదించారంటే నమ్మండి. జీయోహాట్ స్టార్ లైవ్ చేసింది ఈ మ్యాచ్ ని. వాళ్లు ఇచ్చిన అంకెల ప్రకారం రాత్రి 10.38 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ని 43.7 కోట్ల మంది చూశారు.
రాత్రి 9 గంటల ప్రాంతంలో 30 కోట్లకు పైగా ఉన్న ఈ సంఖ్య రాత్రి పదిన్నరకి 43.7 కోట్లు, 10.45 గంటలకు 45 కోట్లకు చేరింది. అది అలా ప్రతి నిమిషానికి మారుతూ పోయింది.. రాత్రి 10.55 గంటలకు 46.7 కోట్లకు మించిపోయింది.
భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఒక ఆట కాదు.. అదొక వ్యసనం, ఒక మహా జాతర! ఈ మాటను మరోసారి అక్షరాలా నిజం చేసింది ఈ మ్యాచ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్.
ఈ మహా సంగ్రామాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar) ప్రత్యక్ష ప్రసారం చేయగా, వ్యూయర్‌షిప్‌లో గత రికార్డులన్నీ బద్దలైపోయాయి. ముఖ్యంగా 'కింగ్' కోహ్లీ క్రీజులో ఉండి మైలురాళ్లు దాటుతుంటే డిజిటల్ స్క్రీన్లు ఊగిపోయాయి.
దేశ జనాభాలో సగం మంది ఒకే స్క్రీన్ ముందు!
భారతదేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను డిజిటల్‌లో లైవ్‌గా వీక్షించారు. టీవీల్లో చూసే కోట్లాది మందిని కాకుండా, కేవలం జియోహాట్‌స్టార్ యాప్‌లో చూసిన వారి సంఖ్యే ఇక్కడ సరికొత్త చరిత్ర సృష్టించింది.
నిమిష నిమిషానికి మారిన గ్రాఫ్.. రాత్రి 10:45కు 45 కోట్లు!
టాస్ పడినప్పటి నుంచి మ్యాచ్ సాగుతున్న కొద్దీ జియోహాట్‌స్టార్‌లో లైవ్ వ్యూయర్స్ కౌంట్ ఊహించని రీతిలో దూసుకెళ్లింది. వాళ్లు అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం:
రాత్రి 9:00 గంటలకు: మ్యాచ్ ఆసక్తికరంగా మారుతున్న సమయంలోనే వ్యూయర్‌షిప్ 30 కోట్లను దాటేసింది.
రాత్రి 10:38 గంటలకు: మ్యాచ్ క్లైమాక్స్‌కు చేరుకుంటున్న వేళ ఈ సంఖ్య ఏకంగా 43.7 కోట్లకు చేరింది.
రాత్రి 10:45 గంటలకు: కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే మరో కోటిన్నర మంది తోడై.. సరికొత్త రికార్డు స్థాయిలో 45 కోట్ల మార్కును తాకింది!
రాత్రి 11 గంటలకు ఆ సంఖ్య 47.1 కోట్లకు చేరింది.
రాత్రి 11.10 గంటలకు 48.4 కోట్లకు చేరింది.
రాత్రి 11.15 గంటలకు అది 50 కోట్లకు చేరువైంది.
రాత్రి 11.27 గంటలకు 52.2 కోట్లకు చేరింది.
కోహ్లీ హాఫ్ సెంచరీ వేళ.. 45.9 కోట్ల ఆల్‌టైమ్ రికార్డ్!
ఇక మ్యాచ్‌లో అసలు సిసలు హైలైట్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్. లక్ష్యఛేదనలో ఆర్సీబీని ముందుండి నడిపించిన విరాట్ కోహ్లీ.. మైదానంలో ఫోర్లతో విరుచుకుపడుతూ తన అర్ధ శతకం (Half-Century) పూర్తి చేసుకున్నాడు. కింగ్ కోహ్లీ 50 పరుగుల మైలురాయిని అందుకునే సరిగ్గా అదే సమయానికి జియోహాట్‌స్టార్‌లో లైవ్ వ్యూయర్‌షిప్ ఏకంగా 45.9 కోట్లకు (దాదాపు 46 కోట్లు) చేరింది. భారతదేశ డిజిటల్ స్ట్రీమింగ్ చరిత్రలోనే ఇదొక రికార్డు అని క్రికెట్ కామెంటర్లు వ్యాఖ్యానించారు.
రాత్రి 10:45 గంటల ప్రాంతానికే 45 కోట్లు దాటి, కోహ్లీ హాఫ్ సెంచరీ సమయానికి 45.9 కోట్లకు చేరిన ఈ వ్యూయర్‌షిప్ గ్రాఫ్ ఇంకా ఆగలేదు. ఎందుకంటే అప్పటికి మ్యాచ్‌లో ఇంకా 9 ఓవర్ల ఆట మిగిలి ఉంది. అంటే ఆర్సీబీ అధికారికంగా విజయం సాధించే క్షణాలు, ఆ తర్వాత జరిగే ట్రోఫీ ప్రెజెంటేషన్ సమయానికి ఈ సంఖ్య ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో ఊహించుకోవచ్చు. భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణకు, ముఖ్యంగా విరాట్ కోహ్లీ, ఆర్సీబీ జట్లకు ఉన్న అపరిమితమైన ఫ్యాన్ బేస్‌కు ఈ అంకెలే సజీవ నిదర్శనం.
రాత్రి 11.20 గంటలకు వీక్షకుల సంఖ్య 50.2 కోట్లకు చేరింది. ఈ దశలో విరాట్ కోహ్లీ అవుట్ అయినట్టు ప్రకటించినా థర్డ్ అంపైర్ రెవ్యూలో అది అవుట్ కాదని తెలిసినప్పుడువీక్షకుల సంఖ్య మరింత పెరిగింది. మ్యాచ్ ముగిసే సమయానికి వీక్షకుల సంఖ్య 51.2 కోట్లకు చేరింది.
Next Story

