
Vaibhav Surya Vamshi
21 కోట్ల మందిని కదిలించిన చిన్నోడు, సెంచరీ చేజారినా 'స్టార్' వీడు!
మళ్లీ సెంచురీ మిస్ అయినా వైభవ్ సూర్యవంశీ వీరోచిత వీర బాదుడు
96 పరుగుల వద్ద ఆ పిల్లాడు అవుట్ అయినప్పుడు సుమారు 21 కోట్ల మంది తీవ్ర భావోద్వేగానికి గురయ్యారంటే అతిశయోక్తి కాదు... అరరే.. ఇంకొక ఫోర్ కొట్టి ఉంటే సెంచరీ చేసి ఉండేవాడే అనుకున్నారు, ఆ పిల్లాడు అవుట్ అయిన తీరు చూసి 'అయ్యో పాపం అనుకున్నారు. ఆ చిన్నోడే వైభవ్ సూర్యవంశి. గుజరాత్ తో శుక్రవారం రాత్రి జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో 47 బంతుల్లో 96 పరుగులు చేసిన వైభవ్.. సెంచరీ మిస్ కావడం ఇది మూడోసారి.
సెంచరీ చేజారినా... 'సూపర్ స్టార్' వైభవ్!
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ముగిసి ఉండవచ్చు. స్కోర్ బోర్డుపై అంకెలు మారిపోవచ్చు. కానీ, క్రికెట్ ప్రేమికుల గుండెల్లో మాత్రం ఆ 14 ఏళ్ల పిల్లాడి పేరే మారుమోగుతోంది. క్రికెట్ చరిత్రలో మరోసారి తనదైన ముద్ర వేస్తూ, అభిమానుల హృదయాలను భావోద్వేగాల తీరానికి తీసుకెళ్లాడు.
ఆట ముగిసినా... ఆ పిల్లాడు సెంచరీకి ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయిన దృశ్యం చూసి క్రికెట్ ప్రపంచం కన్నీళ్లు తుడుచుకుంటోంది. అవును, ఇంకోసారి హృదయాలు బరువెక్కాయి.
మైదానంలో సిక్సర్ల తుఫాన్
రాజస్థాన్ రాయల్స్ జట్టు మొత్తం 215 పరుగులు చేస్తే ఈ వైభవ్ ఒక్కడే 96 పరుగులు చేశాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు అద్భుతం, అమోఘం.
కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి తన ఉద్దేశాన్ని చాటాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, జాసన్ హోల్డర్ ఓవర్‌లో 4, 6, 4తో విరుచుకుపడ్డాడు.
దిగ్గజాలకు చుక్కలు: మహ్మద్ సిరాజ్ వేసిన ప్రమాదకరమైన బౌన్సర్‌ను సైతం అలవోకగా సిక్స్‌గా మలిచాడు. రబాడా, రషీద్ ఖాన్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్ల బౌలింగ్‌లోనూ సిక్సర్ల తుఫాన్ సృష్టించాడు.
ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ సాగుతున్న క్రమంలోనే, ఈ సీజన్‌లో 1000 పరుగుల మైలురాయిని కూడా అందుకుని చరిత్ర సృష్టించాడు ఈ వండర్ కిడ్. 46 పరుగుల వద్ద లైఫ్ దక్కినప్పటికీ, దానిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని జట్టును పోరాట స్థితికి చేర్చాడు.
ఆ ఒక్క అడుగు... కోట్ల మంది ఆక్రోశం
మ్యాచ్ 17.2 ఓవర్లకు చేరింది. వైభవ్ 96 పరుగుల వద్ద ఉన్నాడు. దేశవ్యాప్తంగా టీవీల ముందు కూర్చున్న లక్షలాది మంది అభిమానులు శ్వాస బిగబట్టి చూస్తున్నారు. "ఇంకో నాలుగు పరుగులు... వైభవ్ సెంచరీ సాధిస్తాడు" అని ప్రార్థిస్తున్న వేళ... వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వైభవ్ వెనుదిరిగాడు.
47 బంతుల్లో 96 పరుగులు!
మళ్లీ... మళ్లీ... సెంచరీ చేజారిపోయింది. ఆ క్షణంలో లక్షలాది గుండెలు ఒక్కసారిగా కుంచించుకుపోయాయి. "అరే... ఇంకో నాలుగు పరుగులు చేసి ఉంటే ఎంత బాగుండేది!" అనే ఆక్రోశం ప్రతి క్రికెట్ ప్రేమికుడి నోటా వినిపించింది.
జడేజా (45*), ఫెరీరా (38*) నాటౌట్‌గా నిలిచి జట్టును 214 పరుగుల వరకు చేర్చారు. కానీ, ఈ మ్యాచ్ చూసిన ఎవరికైనా గుర్తుండిపోయేది మాత్రం వైభవ్ సూర్యవంశీ ఒక్కడే.
నువ్వు ఓడిపోలేదు చిన్నా... గెలిచావు!
ఈ పిల్లాడు గుండెల్లోకి ఎక్కేశాడు సామీ... ఇది ప్రతి అభిమాని అంతరంగం. ఈ సీజన్‌లో మూడోసారి సెంచరీ మిస్ అయి ఉండవచ్చు. కానీ, అతడి ఆటలో ఉన్న ధైర్యం, ఆక్రమణాత్మకత, క్లిష్ట సమయాల్లోనూ భయం లేకుండా సిక్సర్ల వర్షం కురిపించే తత్వం... క్రికెట్ లోకానికి ఒక కొత్త సూపర్ స్టార్ దొరికాడనే నమ్మకాన్ని ఇచ్చాయి.
టీవీల ముందు కూర్చుని "వైభవ్... వైభవ్" అని గొంతు చించుకుని అరిచిన అభిమానులు ఈ రాత్రి కూడా కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. కానీ ఆ కన్నీళ్లలో బాధ కంటే, ఆ పిల్లాడి ఆట పట్ల ఉన్న గర్వమే ఎక్కువ.
హార్డ్ లక్ చిన్నా... కానీ నువ్వు ఓడిపోలేదు! ప్రతి సిక్స్‌తో, ప్రతి బౌండరీతో కోట్ల మంది గుండెల్లో నీ స్థానాన్ని శాశ్వతం చేసుకున్నావు. నీ బ్యాటింగ్ సూపర్ స్టార్ లెవల్! భవిష్యత్తు నీదే!
Next Story

