
IPL Final
IPL FINAL : తుదిపోరు కోహ్లీ వర్సెస్ గిల్ జట్ల మధ్యనే!
ఫైనల్ కి గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ ఓటమి, వైభవ్ సూర్యవంశి శ్రమవృధా..
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న కీలక పోరులో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు చెలరేగిపోయారు. రాజస్థాన్ రాయల్స్ ఉంచిన 214 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ సునాయాసంగానే ఛేదించింది. గుజరాత్ ఓపెనర్లు రాజస్థాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా కెప్టెన్ శుభమన్ గిల్ క్లాస్ బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ ఈ సీజన్‌లో 700 పరుగుల అరుదైన మైలురాయిని అధిగమించాడు. శుభమన్ గిల్ సెంచరీ చేశారు. సాయి సుదర్శన్ సైతం అద్భుత అర్ధశతకంతో అతనికి వెన్నుదన్నుగా నిలిచాడు. అయితే సాయిదర్శన్ తన వికెట్ ను తానే పొగొట్టుకున్నాడు. తన బ్యాట్ వెళ్లి వికెట్ల మీద పడడంతో ఆయన అవుటయ్యారు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఈనెల 31న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ లో జరుగుతుంది.
విధ్వంసకర ఓపెనింగ్ భాగస్వామ్యం
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఆరంభం నుంచే అటాకింగ్ గేర్ మార్చారు.
జోఫ్రా ఆర్చర్ వేసిన మూడో ఓవర్లో గిల్ వరుసగా రెండు ఫోర్లు బాది జోరు పెంచగా.. ఆ తర్వాతి ఓవర్లో నాంద్రే బర్గర్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు 14 పరుగుల వద్ద లక్ కలిసి వచ్చింది. ఫెరీరా క్యాచ్ వదిలేయడంతో దొరికిన లైఫ్‌ను సుదర్శన్ చక్కగా ఉపయోగించుకున్నాడు.
పవర్‌ప్లే ముగిసేసరికి తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో సుదర్శన్ వరుస ఫోర్లతో రెచ్చిపోవడంతో గుజరాత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు సాధించింది.
హాఫ్ సెంచరీ.. సిక్సర్ల వర్షం!
బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా బౌలింగ్‌ను సైతం ఈ జోడి సులువుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. కేవలం 30 బంతుల్లోనే శుభ్‌మన్ గిల్ తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దేశ్‌పాండే ఓవర్లో ఒక సిక్సర్, రెండు ఫోర్లతో గిల్ 17 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా వేసిన ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్ వైపు తిప్పేశాడు.
గిల్ సెంచరీ.. 700 పరుగుల మైలురాయి!
నాంద్రే బర్గర్ వేసిన 10వ ఓవర్లో గిల్ మరింత రెచ్చిపోయాడు. ఐదో బంతికి ఫోర్ కొట్టడమే కాకుండా.. ఈ సీజన్‌లో 700 పరుగుల మైలురాయిని దాటేశాడు. ఇదే ఓవర్లో గిల్ తన అద్భుత సెంచరీని (100 పరుగులు) పూర్తి చేసుకోగా, మరోవైపు సాయి సుదర్శన్ (53 పరుగులు) కూడా హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు.
గుజరాత్ విజయం ఇలా..
10 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 127 పరుగులు చేసింది. క్రీజులో పాతుకుపోయిన ఈ ఓపెనర్ల ధాటికి రాజస్థాన్ బౌలర్లు చేతులెత్తేశారు. 16 ఓవర్లు పూర్తి అయ్యే సరికి గుజరాత్ టైటాన్స్ 189 పరుగులు చేసింది.
గుజరాత్ విజయానికి మిగిలిన 24 బంతుల్లో 26 పరుగులు మాత్రమే కావాలి. చేతిలో 8 వికెట్లు ఉండటం, గుజరాత్ విజయం లాంఛనంగానే కనిపించింది. ఇంకా పది బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ గెలిచింది.
సెంచరీ చేజారినా... కోట్లాది మందిని కదిలించిన వైభవ్ సూర్యవంశీ!
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ గెలిచినా కోట్లాది మంది మనసుల్లో నిలిచిన వాడు మాత్రం వైభవ్ సూర్యవంశీ. స్కోర్ బోర్డుపై అంకెలు మారిపోవచ్చు. కానీ, క్రికెట్ ప్రేమికుల గుండెల్లో మాత్రం ఆ 14 ఏళ్ల పిల్లాడి పేరే మారుమోగుతోంది.
క్రికెట్ చరిత్రలో మరోసారి తనదైన ముద్ర వేస్తూ, అభిమానుల హృదయాలను భావోద్వేగాల తీరానికి తీసుకెళ్లాడు.
ఆట ముగిసినా... ఆ పిల్లాడు సెంచరీకి ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయిన దృశ్యం చూసి క్రికెట్ ప్రపంచం కన్నీళ్లు తుడుచుకుంటోంది. అవును, ఇంకోసారి హృదయాలు బరువెక్కాయి.
మైదానంలో సిక్సర్ల తుఫాన్
రాజస్థాన్ రాయల్స్ జట్టు మొత్తం 214 పరుగులు చేస్తే ఈ వైభవ్ ఒక్కడే 96 పరుగులు చేశాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు అద్భుతం, అమోఘం.
కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి తన ఉద్దేశాన్ని చాటాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, జాసన్ హోల్డర్ ఓవర్‌లో 4, 6, 4తో విరుచుకుపడ్డాడు.
దిగ్గజాలకు చుక్కలు: మహ్మద్ సిరాజ్ వేసిన ప్రమాదకరమైన బౌన్సర్‌ను సైతం అలవోకగా సిక్స్‌గా మలిచాడు. రబాడా, రషీద్ ఖాన్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్ల బౌలింగ్‌లోనూ సిక్సర్ల తుఫాన్ సృష్టించాడు.
Next Story

