టీటీడీ ఆడిటింగ్ లో బయటపడని 'వీఐపీ లేఖల' లెక్కలు..
ప్రజాప్రతినిధుల సిఫారసులు, సమాన్యులకు దక్కని వీఐపీ దర్శనాలపై వీడియో కథనం.
టీటీడీలో కొన్ని మినహా, మిగతా కార్యక్రమాలు , సేవలు అత్యంత పారదర్శకంగా ఉంటాయి. రోజూ శ్రీవారిని సగటున 70 నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. రోజువారీ హుండీ ఆదాయం ఎంత? ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు? ఎంతమంది తలనీలాలు సమర్పించారు? తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఎంతమంది భోజనం చేశారు? అశ్విని ఆసుపత్రి ద్వారా ఎంతమందికి వైద్య సేవలు అందాయి? అనే విషయాలను టీటీడీ అధికారికంగా ప్రతిరోజూ వెల్లడిస్తుంది.
ఇదంతా బాగానే ఉన్నా... వీవీఐపీ, వీఐపీ, విచక్షణ కోటా దర్శన కోటా టికెట్ల విషయంలో మాత్రం పూర్తి పారదర్శకత ఎందుకు ఉండదు? రోజూ ఎంతమందికి వీఐపీ టికెట్లు కేటాయిస్తున్నారు? అనే అంశంపై స్పష్టత లేకపోవడం వెనుక మతలబు ఏమిటి? అనే వివరాల్లోకి వెళ్లే ముందు..
తిరుమల జేఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ స్థాయి అధికారే అన్ని నిర్ణయాలు తీసుకొంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ పద్ధతి కాకుండా, పారదర్శక లోపించకుండా మూడెంచెల పర్యవేక్షణ వ్యవస్థ అవసరం అనేది టీటీడీ మాజీ చేర్మన్ కు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన కుప్పాల గిరిధర్ చేస్తున్న సూచన.
ఏపీలో 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది లోక్సభ ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో పాటు మంత్రులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచి సిఫారసు లేఖలు విపరీతంగా వస్తుంటాయి. తెలంగాణ నుంచి 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, 17 మంది లోక్సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరి నుంచి కూడా పెద్ద సంఖ్యలో సిఫారసు లేఖలు అందుతుంటాయి.
ఆలయ వర్గాల సమాచారం ప్రకారం రోజుకు ఉదయం వేళల్లో కనీసం 7,000 నుంచి 15,000 మందికి వీఐపీ, వీవీఐపీ సిఫారసు లేఖలపై దర్శనాలు కల్పిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా విచక్షణ కోటా టికెట్లు జారీ చేస్తారు. అది కూడా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపైనే. ఒక లేఖపై ఐదుగురికి ఉదయం సుప్రభాత సేవ నుంచి వీఐపీ ప్రొకోకాల్, విఐపీ జనరల్ అనేది ప్రామాణిక దర్శనం,
ఈ లేఖలు తీసుకున్న వారితో తిరుమల అదనపు ఈఓ కార్యాలయం వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కిటకిటలాడుతుంద. గదులు, లేఖలు సమర్పించడానికి మధ్యాహ్నం వరకు నిరీక్షిస్తారు. ఈ నెల ఒకటో తేదీ సిఫారసు లేఖలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించినా, అప్పటికే ప్రజాప్రతినిధుల నుంచి లేఖలు తీసుకున్న వారు తిరుమలకు చేరుకుని నిరసనకు దిగిన సంఘటన తెలిసిందే. ఈ దృశ్యమే చెబుతుంది.
"ఎన్ని వేల మందికి వీఐపీ సిఫారసులపై శ్రీవారి దర్శనం టికెట్లు ఇస్తారనే విషయం. ఈ వివరాలు మాత్రం అధికారులు బయటికి వెల్లడించరు. అంతర్గత ఆడిటింగ్ నిర్వహించడం అవసరం" అని కుప్పాల గిరిధర్ చేస్తున్న డిమాండ్ చేశారు. రెండేళ్లకు ఓసారైనా సిబ్బందిని మార్చాల్సిన అవసరాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
Next Story

