నల్లమల రాజుల సీక్రెట్ కోడ్.. చారల వెనుక దాగిన అసలు కథ తెలుసా?
x

నల్లమల రాజుల సీక్రెట్ కోడ్.. చారల వెనుక దాగిన అసలు కథ తెలుసా?

పులిశరీరంపై చారలే 'డిజిటల్ ఫింగర్ ప్రింట్స్'.. అడవిలో ట్రాప్ కెమెరాలు ఎలా పనిచేస్తాయో చెప్పే వీడియో స్టోరీ...


Click the Play button to hear this message in audio format

పులి శరీరంపై చారలు కూడా ప్రత్యేక పాఠం చెబుతాయి. చారలుగా కనిపించే వెంట్రుకల రంగులపై కూడా శాస్త్రీయ అధ్యయనం జరుగుతుంది. చివరికి పులి ముక్కు పెరుగుల దాని జీవన విధానాన్ని వివరించడంమే కాదు. ఆసక్తికరమైన అనేక విషయాలను చెబుతోంది.

సాధారణంగా మనిషిని గుర్తించినంత సులువుగా వన్యమృగాలను గుర్తించడం సాధ్యమా? అనే ప్రశ్నలకు సమాధానాలే ఈ కథనం.
దేశంలో నాలుగేళ్లకు ఒకసారి పులుల లెక్కింపు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా నారార్జానసాగర్, శ్రీశైలం టైగర్ ప్రాజెక్టులో కూడా పులుల సంఖ్య గణనీయంగానే పెరిగింది.
పులి వయస్సు ఎలా నిర్ధారిస్తారు? అనే అంశంపై రాజస్థాన్ లోని ర్యాతంబోర్ నేషనల్ పార్క్ నేచురలిస్టు ఆశ్లేష్ శర్మ అనేక విషయాలను వివరించారు. ఏమంటున్నారంటే..
"ఒక సగటు పులి శరీరంపై 100 కంటే ఎక్కువ చారలు (Stripes) ఉంటాయి. ప్రతి పులి పరిమాణం, రకం (Subspecies) ఆధారంగా ఈ సంఖ్య 80 నుండి 120 వరకు ఉండవచ్చు.
ఇందులో ప్రత్యేకతలు చూస్తే... మనుషులకు వేలిముద్రలు (Fingerprints) ఎంత ప్రత్యేకమో, పులికి దాని చారల ఆకారం (Pattern) అంత ప్రత్యేకం. ప్రపంచంలో ఏ రెండు పులుల చారల అమరిక ఒకేలా ఉండదు" అని అశ్లేష్ శర్మ వివరించారు.
ఆసక్తికరమైన వివరాల కోసం ఈ వీడియో చూడిండి..

నల్లమల అటవీ ప్రాంతంలోని సుమారు 5,937 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ టైగర్ రిజర్వ్ అటవీప్రాంతం తెలంగాణలోని 'అమ్రాబాద్ టైగర్ రిజర్వ్'తోనూ, దక్షిణాన శేషాచలం అటవీ శ్రేణులతోనూ అనుసంధానమై బలమైన వన్యప్రాణి కారిడార్‌ విస్తరించింది.
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) మరియు వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా, NSTR యాజమాన్యం 'మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ - ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్' యాప్ మరియు కెమెరా ట్రాపింగ్‌ను ఉపయోగించి ఏటా సర్వేను చేపడుతోంది.
నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) భారతదేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రంగా విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారం NSTR పరిధిలో ప్రస్తుతం 76 పెద్ద పులులు నివసిస్తున్నాయి (వీటితో పాటు అదనంగా 11 పిల్ల పులులు కూడా ఉన్నాయి). వీటిని లెక్కించడానికి M-STrIPES (ఎం స్ట్రైబ్స్) ఎలా పనిచేస్తుంది? అనేది చూద్దాం..
1) GPS, రూట్ ట్రాకింగ్ పద్దతిలో అటవీ సిబ్బంది (బీట్ ఆఫీసర్లు) అడవిలో గస్తీ (Patrolling) తిరిగేటప్పుడు యాప్‌లోని GPS ఆన్‌లో ఉంటుంది. వారు ఏ రూట్‌లో వెళ్లారు, ఎంత దూరం నడిచారో ఇది లైవ్‌గా రికార్డు చేస్తుంది.
2 ) అడవిలో పులి లేదా ఇతర జంతువులు ప్రత్యక్షంగా కనిపిస్తే యాప్‌లోనే ఫోటో తీసి అప్‌లోడ్ చేస్తారు.
3) జంతువుల పాదముద్రలు (Pugmarks), పెంట (Scat), చెట్లపై గాట్లు కనిపిస్తే ఆ ప్రదేశం యొక్క GPS కోఆర్డినేట్స్‌తో సహా నమోదు చేస్తారు.
కెమెరా ట్రాప్ డేటా ల్యాంకింగ్: ఫేజ్‌-3లో కెమెరాల్లో నమోదైన ఫోటోలను ల్యాబ్‌లోని సాఫ్ట్‌వేర్‌లోకి ఎక్కిస్తారు.

పులి శరీరంపై చారలే కీలకం..

చారల గుర్తింపు (Image Matching): ల్యాబ్‌లోని సాఫ్ట్‌వేర్ పులి శరీరంలోని చారలను విశ్లేషించి (Digital Fingerprinting), పాత డేటాబేస్‌తో పోల్చి చూస్తుంది. దీనివల్ల ఒకే పులి రెండు కెమెరాల్లో పడినా రెండుసార్లు లెక్కించబడకుండా ఖచ్చితమైన సంఖ్య వస్తుంది. దీనికోసం నల్లమల టైగర్ కారిడార్ ప్రాజెక్టు పరిధిలో..
పులులను లెక్కించడానికి అత్యాధునిక 48-మెగాపిక్సెల్ కెమెరాలుఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (పులుల గణన) కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త 48-మెగాపిక్సెల్ హై-రెజల్యూషన్ ట్రాప్ కెమెరాలను ప్రవేశపెట్టింది. ఇవి రాత్రి సమయాల్లో లేదా దట్టమైన పొదల్లో అత్యంత వేగంగా కదిలే జంతువులను కూడా చాలా స్పష్టంగా క్లిక్ చేయగలవు.
ప్రస్తుతం NSTR కోర్ ఏరియా, కారిడార్లలో సుమారు 1,500 నుంచి 1,600 కెమెరా ట్రాప్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి.
సాధారణంగా అడవిని ప్రతి రెండు చదరపు కిలోమీటర్ల గ్రిడ్‌లుగా విభజించి, వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉండే దారుల్లో (Trails) ఈ కెమెరాలను అమర్చుతారు.

అడవిలో కెమెరాలు ఎలా పనిచేస్తాయి..?

ఈ కెమెరాలకు మోషన్ (కదలిక), ఇన్‌ఫ్రారెడ్ (శరీర వేడి) ఆధారంగా పసిగట్టే సెన్సార్లు ఉంటాయి. ఏదైనా జంతువు లేదా మనిషి కెమెరా ముందుకు రాగానే, అది ఆటోమేటిక్‌గా ఫోటో లేదా చిన్న వీడియో క్లిప్‌ను రికార్డ్ చేస్తుంది.
రాత్రి వేళల్లో నిఘా: జంతువులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇన్విజిబుల్ ఇన్‌ఫ్రారెడ్ ఫ్లాష్‌ను ఉపయోగించి రాత్రి వేళల్లోనూ స్పష్టమైన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను ఇవి తీస్తాయి
కారిడార్ కదలికల గుర్తింపు: ఇటీవల తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల వరకు ఒక పులి ప్రయాణించిన లాంగ్-డిస్టెన్స్ మూవ్‌మెంట్‌ను కూడా ఈ కారిడార్ ట్రాప్ కెమెరాలే. వాటి ఆధారంగా సేకరించిన సమాచారంతో పులుల సంఖ్యను నిర్ధారిస్తారు.
Read More
Next Story