x

నిత్యావసర సరుకుల ధరల మంట.. సామాన్యుడికి బియ్యం భారం

వర్షాభావం, నీటి కొరతతో 50 శాతం పడిపోనున్న ధాన్యం దిగుబడి (వీడియో కథనం)


ధరల పెరుగుదలలో ఉప్పు నుంచి పప్పు వరకు, ధాన్యం నుంచి బియ్యం వరకు ఏమాత్రం తేదా లేదు. ఈ పరిస్థితుల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈసారి ధాన్యం దిగుబడి 50 శాతం తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈనేపథ్యంలోనే బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. మూడు నెలల క్రితం 10 కిలోల బియ్యం రూ.550 ఉంటే, ఇప్పుడు రూ.750కి చేరింది. 26 కిలోల బస్తా రూ.1300 నుంచి రూ.1700కు పెరిగింది. పాత ధరతో పోలిస్తే బస్తాపై ఏకంగా రూ.300 నుంచి 4 వందల వరకు అదనపు భారం పడుతోంది. ధరలు ఇంతలా పెరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందీ, పౌరసరఫరాల శాఖ నిరంతర నిఘా ఏమైందీ, తనిఖీ చేయాల్సిన మార్కెటింగ్ శాఖ ఏమి చేస్తోంది. అనే ప్రశ్నలు తలెత్తాయి.


రాష్ట్రంలో నిత్యావసరాల ధరల మంట సామాన్యుడి నడుం విరుస్తోంది. మూడు నెలల క్రితం 10 కిలోల బియ్యం ధర ₹550 ఉంటే, ఇప్పడు అది ఏకంగా 750కి చేరింది. ఇక 26 కిలోల బస్తా ₹1300 నుంచి రూ.1800 వరకు పలుకుతోంది. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దుకాణాలు, సూపర్ మార్కెట్లలో కిలోకు పది రూపాయలకు తగ్గించి విక్రయంచే కార్యక్రమానాకి శ్రీకారం చుట్టింది. పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన ఈ దుకాణాలు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి..
ఈ సారి 'సూపర్ ఎల్ నినో' హెచ్చరికల నేపథ్యంలో, నీటి కొరత తీవ్రంగా ఉంటుందని భావించి వరి సాగును తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించారు. కరువు పరిస్థితులు ప్రాజెక్టుల్లో నీటిమట్టం పడిపోవడం వల్ల ఈసారి సాగు విస్తీర్ణం ఘోరంగా పడిపోయింది.

కారణం ఇదీ..

తుంగభద్ర జలాశయం పరివాహక ప్రాంతంలోని కర్నూలు, అనంతపురం జిల్లాలో పంటలు ఎండుతున్నాయి. ఆంధ్రా పరిధిలోని కర్నూలు జిల్లాలో వంద కిలోమీటర్లు ఎల్ఎల్ సీ కాలువకు నీరు సరిపడ విడుదల చేయని కారణంగా దాదాపు లక్ష ఎకరాలకు నీరు పారుదల జరగడం లేదు. ఎల్ ఎల్ సీ కాలువకు ఖరీఫ్ లో 600 క్యూసెక్కుల నీరు అవసరం. ప్రస్తుతం 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ నీరే కర్ణాటక పరిధిలోని విజయనగర, బళ్లారి జిల్లాల మీదుగా కర్నూలు జిల్లాలోని ఆలూరు వద్ద 145 కిలోమీటర్ నుంచి ఆంధ్ర పరిధి ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి నందికొట్కూరు, ఆదోని మరో రెండు నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్లు నీరు ప్రవహించాలి. ప్రస్తుతం సగం వంతు నీరు కూడా విడుదల చేయని కారణంగా సాకులోని ఖరీఫ్ పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.

కృష్ణా డెల్టాకు సరిపడా నీళ్లు ఇవ్వాలంటే 150 టీఎంసీలు అవసరం. కానీ శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో తగినంత నీటి నిల్వలు ఉన్నా, తాగునీటికి మాత్రమే వాడాలనేది ప్రభుత్వ నిర్ణయం. దీంతో ఈ సీజన్‌లో నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పులిచింతలలో ఉన్న 29 టీఎంసీల నీటిని కేవలం తాగునీటికే కేటాయించాల్సి రావడంతో ఈ ఏడాది వరి సాగుకు నీళ్లు ఇవ్వలేమని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది.

అన్నపూర్ణ జిల్లాల పరిస్థితి ఎలా ఉందంటే..

వరి సాగు చేయడంలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలు ఏపీలో అత్యధికంగా వరి సాగు చేసే ప్రాంతాలు. కాగా, ఏటా సాధారణంగా ఏపీలో 15 నుంచి 16 లక్షల హెక్టార్లలో వరి సాగు జరిగి, సగటున 70 నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది.
'అన్నపూర్ణ'గా పిలిచే గోదావరి జిల్లాల్లోనే సాధారణంగా 4 నుంచి 5 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా, ఈసారి తీవ్ర నీటి కొరత వల్ల సాగు విస్తీర్ణం సగానికి పైగా పడిపోయింది. ప్రాజెక్టులు, చెరువుల కింద ఆయకట్టు సాగు గణనీయంగా తగ్గడంతో రైతులు కేవలం బోరు బావుల కింద పరిమితంగానే సాగు చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఈ ఏడాది దిగుబడి 50 శాతం మేర (దాదాపు 35-40 లక్షల టన్నులకు) తగ్గే ప్రమాదం ఉందనేది వ్యవసాయ నిపుణుల అంచనా.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో వరి పంట సాధారనంగా 2,16,655 ఎకరాలు కాగా, 1,87,905 ఎకరాలకు సరిపడ నారు మడులు 8945.25 ఎకరాల్లో మాత్రమే వేశారు, అంతేకాకుండా, వరి సాగుతో ఈ సంవత్సరం 5,62,123 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే వ్యవసాయ శాఖ అంచనా. పరిస్థితి పూర్తిగా తిరగబడింది. అందులో 50 శాతం కూడా దిగుబడి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వం కంట్రోల్ ధరతో బియ్యం కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తుత వ్యవసాయ సీజన్ పరిస్థితులు ప్రధానంగా గుర్తు చేస్తున్నాయి.


Read More
Next Story