వర్షాకాలంలోనూ.. ఏపీలో కోరలు చాచిన కరువు
ప్రాజెక్టులు నిండినా.. ఎండుతున్న గొంతులు. సర్కార్ యాక్షన్ ప్లాన్ పై వీడియో కథనంలో సమగ్ర వివరాలు చూడండి.
రుతుపవనాలతో వర్షాలు సమృద్ధిగా కురవాల్సిన సమయం ఇది. చల్లదనం పంచాల్సిన సీజన్. వేసవికి ఏమాత్రం తీసిపోని విధంగా నీటి ఎద్దడి ఏర్పడింది. ట్యాంకర్లతో నీటిని సరఫరా అనివార్యంగా మారింది. ఈ ఏడాది విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. సూపర్ ఎల్ నినో కారణంగా పల్లెలే కాదు. పట్టణాలు కూడా తాగునీటికి కటకటలాడుతున్నాయి. కొన్ని పట్టణాల్లో మూడు రోజులకు ఒకసారి అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రాయలసీమకు తలమానికమైన తుంగభద్ర ప్రాజెక్టులో నీరు ఉంది. శ్రీశైలంలో నీటి నిలువలు ఉన్నాయి. నాగార్జునసార్ లో కూడా ఆశాజనకంగా నీటి నిలువలు ఉన్నాయి. కరువు ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ, ఈ నీరంతా సేద్యానికి కాకుండా తాగునీటికి మాత్రమే పరిమితం చేశారు.
రాష్ట్రంలో సాగునీరు లేక పంటలు వేయవద్దని రైతులకు ప్రభుత్వం సూచించే పరిస్థితి వచ్చింది. మరోవైపు విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం వంటి ప్రధాన నగరాల్లో ట్యాంకరు నీటి కోసం రూ. వేలు ఖర్చే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింి.
"తాగు నీటి ఎద్దడి ఉన్న పట్టణాల్లో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం 1158.45 కోట్లతో పనులు మంజూరు చేశాం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు.
ప్రధాన జలాశయాలు, నదుల్లో ప్రవాహం ఉన్నా, ఎగువ ప్రాంతాల నుంచి వరదనీటి ప్రవాహం తగ్గింది. దీనిని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల మంచినీటి అవసరాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
"రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో పనులు చేపట్టడం ద్వారా అదనంగా 106.99 మిలియన్ లీటర్ల నీటిని అందుబాటులోకి తీసుకుని రావడమే ప్రధాన ఉద్దేశం" అని రాష్ట్రం పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఎల్ నినో కారణంగా తాగునీటికి ఇబ్బంది ఏర్పడిందనేది ఆయన చెప్పిన మాట.
ప్రాజెక్టుల నీరు తాగడానికే...
ఏపీ, కర్ణాటకకు సాగు, తాగు నీటి అవసరాలు తీరుస్తున్న తుంగభద్ర ప్రాజెక్టు. కర్ణాటక రాష్ట్రం హోసపేట వద్ద ఉన్న ఈ ప్రాజెక్టులో గరిష్ట నీటి నిలువ 105 అడుగులు మిగిలింది. ఒండ్రు చేరడం వల్ల సామర్థ్యం 30 టీఎంసీలు తగ్గింది. ప్రస్తుత నీటిమట్టం 1,630 అడుగులు కాగా, ప్రస్తుతం 1.5.788 అడుగులు ఉంది. ఇన్ ఫ్లో 8,680 టీఎంసీలకు 8,680 టీఎంసీలు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టుల్లో నీటి గలగలలు..
శ్రీశైలం ప్రాజెక్ట్: పూర్తి స్థాయి నీటి నిల్వ 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో సుమారు 166.7 టీఎంసీలు నిలువ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 312.05 టీఎంసీలకు 173.8 టీఎంసీలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల్లో తుంగభద్ర నుంచి కడప, కర్నూలు, అనంతపురం కాలువలకు తక్కువ మోతాదులో నీటిని విడుదలు చేస్తున్నారు.
ఇంకుతున్న స్టోరేజ్ ట్యాంకులు
తుంగభద్రపై ఆధారంగా రాయలసీమ ప్రాంతాలకు ప్రయోజనం ఉంది. అయితే, గుంతకల్లు 5,700 మిలియన్ టీర్ల నీటి వల్ల సామర్ధ్యం ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో 1,290 ఎంల్ కు నిలువలు తగ్గాయి. ఆదోని,, రాయదుర్గం, లో 3,052 ఎంఎల్ నుంచి 534 మిలియన్ లీటర్లకు పడిపోయింది. ఎమ్మిగనూరులో అదే పరిస్థితి.
నాగార్జున సాగర్ కాలువకు నీటి విడుదలతనే సాగర్ పై పరివాహక ప్రాంతంలో ఒంగోలు, నరసారావుపేట, చిలుకలూరి పేట, మార్కాపురం , పొదిలి, వినుకొండ, మాచెర్ల, సత్తెనపల్లె, కందుకూరు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులే ఆధారం. ఇక్కడ కూడా నీరు అడుగంటడం వల్ల ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
తుంగభద్రపై ఆధారపడిన గుంతకల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో 5,700 మిలియన్ లీటర్ల సామర్థ్యానికి కేవలం 1,290 ఎంఎల్ నిల్వలు మాత్రమే మిగిలాయి. ఆదోని, రాయదుర్గంలో నిల్వలు 3,052 ఎంఎల్ నుంచి 534 ఎంఎల్ కు పడిపోయాయి.
నాగార్జునసాగర్: కాలువ పరివాహక ప్రాంతాల్లో ఆధారిత ఒంగోలు, నరసారావుపేట, మార్కాపురం, పొదిలి, కందుకూరు ప్రాంతాల్లోనూ ట్యాంకులు ఎండిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
పల్లెలే కాదు.. పట్టణాలు కూడా..
రాష్ట్రంలోని దాదాపు 12 పట్టణాలు, మూడు వేల గ్రామాల్లో తాగునీటి సరఫరాపై ఎల్ నినో ప్రభావం ఉంటుందనే అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. దీని వల్ల చెరవుల్లో నీరు తగ్గుతోంది. దీని పరిష్కారానికి ప్రాజెక్టుల నుంచి చెరువులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో, పంచాయతీల్లో పొదిలి గుత్తి, పలమనేరు, రాయచోటి, బేతంచెర్లలో మూడు నుంచి నాలుగు రోజులకు ఓసారి నీటిని సరఫనా చేస్తున్నారు. గుంతకల్లు, ఆదోని రాయదుర్గం, ఎమ్మిగనూరు సమ్మర్ ట్యాంకుల్లో నిలువలు అడుగంటాయి.
రాష్ట్రంలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల పరిధిలోని పలు మున్సిపాలిటీలు, పట్టణాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కరువు తీవ్రంగా ఉంది. అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, మదనపల్లె, హిందూపురం, రాయదుర్గం, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. రాయలసీమలోని ప్రధాన మున్సిపాలిటీల్లో తాగునీటి పైప్‌లైన్ సరఫరా చాలక నిత్యం వందలాది ట్యాంకర్ల ద్వారా వీధివీధికీ నీటిని ఉచితంగా/ప్రభుత్వ నిర్వహణలో సరఫరా చేస్తున్నారు. 3 రోజులకు ఒకసారి మాత్రమే కుళాయి నీరు రావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ట్యాంకర్లతో దోపిడీ...
తిరుపతి నగర ప్రజలకు 'కళ్యాణి డ్యామ్', 'తెలుగుగంగ' ప్రధాన ఆధారాలు. తిరుపతి నగరానికి రోజుకు దాదాపు 65 నుంచి 70 మిలియన్ లీటర్ల (MLD) నీరు అత్యవసరం. ప్రస్తుతం లభ్యత సగానికి పైగా పడిపోవడంతో నగరపాలక సంస్థ పొదుపుగా రోజు విడిచి రోజు లేదా పరిమితంగా నీటిని సరఫరా చేస్తోంది. కళ్యాణి డ్యామ్‌లో నీటిమట్టం అడుగంటడంతో తెలుగుగంగ నీటిపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది.
తిరుపతి నగరంలో 5,000 లీటర్ల ట్యాంకర్ నీటిని డిమాండ్‌ను బట్టి రూ. 1,000 నుండి రూ. 1,800 వరకు విక్రయిస్తుండగా, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల కోసం పెద్ద ట్యాంకర్లకు (10,000 లీటర్లు) రూ. 3,000 వరకు వసూలు చేస్తున్నారు.
విజయవాడ: కృష్ణా నది ఒడ్డున ఉన్నప్పటికీ సమ్మర్ స్టోరేజ్, భూగర్భ జలాలు పడిపోవడంతో ప్రైవేటు ట్యాంకర్ ధర రూ. 1,200 నుంచి రూ. 2,000 మధ్య పలుకుతోంది.
విశాఖపట్టణం: ముడుసరలోవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎండిపోవడంతో జీవీఎంసీ సరఫరా చేసే ట్యాంకర్ ధర రూ. 800 - 1,200 ఉంటే, ప్రైవేటు ట్యాంకర్ యజమానులు ఏకంగా రూ. 2,600 నుంచి రూ. 3,500 వరకు పిండుకుంటున్నారు.
వేల గ్రామాల్లో తప్పని ఇబ్బందులు
రాష్ట్రంలోని దాదాపు 12 పట్టణాలు, మూడు వేల గ్రామాల్లో తాగునీటి సరఫరాపై ఎల్ నినో ప్రభావం ఉంటుందనే అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. దీని వల్ల చెరవుల్లో నీరు తగ్గుతోంది. దీని పరిష్కారానికి ప్రాజెక్టుల నుంచి చెరువులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 123 పురపాలకలు, నగర పాలక సంస్థల్లో , పంచాయతీల్లో పొదిలి గుత్తి, పలమనేరు, రాయచోటి, బేతంచెర్లలో మూడు నుంచి నాలుగు రోజులకు ఓసారి నీటిని సరఫనా చేస్తున్నారు. గుంతకల్లు, ఆదోని రాయదుర్గం, ఎమ్మిగనూరు సమ్మర్ ట్యాంకుల్లో నిలువలు అడుగంటాయి.
అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లోని కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో వర్షపు నీటి నిల్వ చర్యల వల్ల పాక్షికంగా భూగర్భ జలాలు పెరిగినప్పటికీ, మిగిలిన అనేక పట్టణాలు, మండలాల్లో తీవ్ర వర్షాభావం వల్ల భూగర్భ జలాలు 300 నుంచి 500 అడుగుల కంటే లోతుకు అడుగంటిపోయాయి. మదనపల్లె, హిందూపురం, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని, రాయచోటి వంటి ప్రాంతాల్లో పైప్‌లైన్ నీరు రాక ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలతో ప్రకటించిన కార్యాచరణ ఆచరణలో ఏమేరకు ప్రజలకు ఉపయోగపడుతుందనేది సందేహమే..?
Next Story


