చిత్తూరు జిల్లా యాదమరి పీహెచ్ సీలో పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (ఫైల్)
బ్రిటన్, సింగపూర్ తరహాలో ఏపీ పౌరుల ఆరోగ్యానికి రక్ష
రోగం రాకముందే కట్టడి చేసే డిజిటల్ విప్లవంతో 'సంజీవని'కి ఏఐతో హెల్త్ ప్రొఫైల్ ట్రాకింగ్.
ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ రక్షణ కల్పించింది. ఆర్టిఫిషియల్ ఆధారంగా పర్యవేక్షణ ఉంచింది. తద్వారా మనిషి రోగాలను ఎప్పటికప్పుడు గుర్తించి అప్రమత్తం చేయడమే కాదు. వైద్యులకు కూడా సూచనలు అందించే సంజీవని ప్రాజెక్టును నూతన సంవత్సరం కానుకగా 2027 జనవరి ఒకటో తేదీ రాష్ట్రంలో విస్తరించనున్నారు. దీనికోసం 90 రోజుల రూట్ మ్యాప్ టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది.
రోగులు వైద్యం కోసం ఆస్పత్రి వద్దకు వెళ్లకుండానే, ఇంటి ముంగిటకే సేవలు అందించే పైలెట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ ఏడాది జూలై ఐదో తేదీ కుప్పంలో ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టారు.
కుప్పం నియోజకవర్గంలో ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో విస్తరించారు. క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, డిజిటల్ డేటా ఆపరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి, కుటుంబంలోని సభ్యులందరీ ఆరోగ్య స్థితి గతులను కంప్యూటర్లలో నిక్షిప్తం చేశారు. ఆ తరహాలో 63 వేల మందిని మొదట ప్రయోగాత్మకంగా వివరాలు సేకరించడమే కాకుండా, 41 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారందరికీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ గుర్తింపు నంబర్ (ఏబీహెచ్ఏ) కేటాయించారు. ఈ మెడికల్ హిస్టరీని టిజిటలైజేషన్ చేశారు.
"కుప్పంలో చేసిన ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఆరోగ్య శాఖ అధికారులు నివేదికలు సమర్పించారు. ఏమాత్రం నిర్లక్ష్యానికి ఆస్కారం లేకుండా, క్రమం తప్పకుండా, రోగులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ట్రాక్ చేయడం, మందులు ఇచ్చాం. దీంతో 56 శాతం మందిలో బీపీ, 16 శాతం రోగుల్లో చక్కెర వ్యాధి తీవ్రత తగ్గిండం సాధ్యమైంది" అని నిర్ధారణకు వచ్చారు.
"ఈ పథకం ప్రారంభించడానికి వెనుక లోతైన అధ్యయనం, దూరదృష్టి ఉంది" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు.
బ్రిటన్ లో నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS - UK), సింగపూర్ లో కూడా పౌర ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. దీనికోసం నేషనల్ హెల్త్ ప్లాన్ ద్వారా ఆరోగ్య భద్రతపై వివరాలు సేకరించిన ఆ దేశాల్లో అవన్నీ డిజిటలైజేషన్ చేయడంతో సెంట్రల్ మానిటరింగ్ సిస్టంలో సమీక్షిస్తుంటారు. ఆ తరహాలోనే ఏపీలో ప్రతి పౌరుడి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాం. అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెబుతున్న మాట.
అనుకోని విధంగా సోకే రోగాల వల్ల పేదలకు చికిత్స చేయించుకోవడం భారంగా మారుతోంది. ఆ పరిస్థితి నుంచి కాపాడేందుకు .
"చికిత్స కు ముందే.. ముందస్తు నివారణ" లక్ష్యంగా సంజీవని ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం 2027 జనవరి ఒకటో తేదీ రాష్ట్ర వ్యాపితంగా అమలు చేయడానికి 90 రోజుల రూట్ మ్యాప్ సిద్ధం చేసింది.
ఇందులో
రక్తపోటు, మధుమేహం వంటి లక్షణాలు బయటపడకుండా శరీరాన్ని నమిలేసే 'సైలెంట్ కిల్లర్స్' ను ప్రారంభంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో గుర్తించి, కట్టడి చేయడం. సాంప్రదాయ చికిత్సా పద్ధతులకు స్వస్తి చెప్పి, కృత్రిమ మేధస్సు, డేటా అనలిటిక్స్ ఆధారిత ముందస్తు నివారణ మోడల్‌కు ప్రాధాన్యమివ్వడం. ఈ పథకంలో కీలకం.
( తరహా సేవలు ఎక్కడ ఉన్నాయనేది వివరించే కథనం ఈ వీడియోలో చూడండి)
Next Story

