x

బాంబుల మోత నుంచి బహుళ పంటలు.. 'కప్పట్రాళ్ల' రక్తాక్షరాలకు శుభంకార్డు

ఫ్యాక్షన్ చరిత్రను చెరిపివేసిన ఐపీస్ అధికారి మాస్టర్ ప్లాన్ ను వివరించే వీడియో స్టోరీ


రాయలసీమలో ఫ్యాక్షన్ భూతానికి ఎన్నో కుటుంబాలు బలయ్యాయి. అందులో కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామంలో పరిస్థితి దారుణంగా ఉండేది. 40 ఏళ్లుగా ముఠాకక్షలు, వర్గపోరుతో గ్రామం నలిగిపోయింది. రక్తాక్షరాల చరిత్రను వ్యవసాయం చెరిపేసింది. భయం నీడ నుంచి నూతన జీవనం వైపు అడుగులు వడివడిగా సాగుతున్నాయి.

ఈ గ్రామానికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సాహసించలేదు. అలాంటి కప్పట్రాళ్లలో రూ. 200 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి గ్రామీణ బ్యాంకు ఎదిగింది" పండ్ల తోటలతో ఒక ఆదర్శ గ్రామంగా నిలిచింది. ఇక్కడి జీవన విధానంలో మార్పు తీసుకుని రావడానికి ఓ ఐపిఎస్ అధికారి చేసిన. చేస్తున్న యజ్జం ఎలా ఉందో చూద్దాం...
కప్పట్రాళ్ల గ్రామ స్వరూపం మారింది. ఫ్యాక్షన్ నుంచి ఆధునిక జీవనంవైపు సాగడానికి బాటలు వేసిన తీరును వివరించే వీడియో కథనం.

కప్పట్రాళ్ల గ్రామం కథమేమిటి?

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామం నాలుగు దశాబ్దాలుగా ఫ్యాక్షన్ తో విలవిలలాడింది ఈ గ్రామం ఈదల దేవర బండ పంచాయతీ పరిధిలో ఉంటుంది గ్రామంలో 1,020 కుటుంబాలు ఉంటాయి.
కప్పట్రాళ్ల గ్రామంలో ఫ్యాక్షన్ మరకలు చెరిపివేసి ఐదు అంశాల్లో గ్రామంలో బ్యాంకు ఏర్పాటు చేయడం, శ్రీశైలం రైట్ బ్రాంచ్, కెనాల్ నుంచి పందికోన రిజర్వాయర్ లో నీటిని తీసుకురావడం. మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం. జెడ్పీ హైస్కూల్ ఏర్పాటు చేయించడం కీలక మలుపుతో గ్రామం కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఫ్యాక్షన్ వల్ల చాలా మరణిస్తే, కేసుల్లో చిక్కుకొని సుమారు 80 మంది నిధులు జైల్లో ఉన్నారు. కరోనా సమయంలో వారంతా పెరవల్ బెయిల్ పైన బయటకు వచ్చి జీవనం సాగిస్తున్నారు.

గతాన్ని ఓసారి చూద్దాం...

కప్పట్రాళ్ల గ్రామంలో చోటుచేసుకున్న ఫ్యాక్షన్ గొడవలు హత్యలు, కారణంగా బాంబుల స్వైర విహారం చేస్తే కత్తులు కుత్తుకులను కోశాయి. వర్గ పోరు ఆధిపత్య పోరుతో గ్రామం తల్లడిల్లింది. సేద్యం గాడి తప్పింది. ఉపాధి కష్టమైంది.
2015 సంవత్సరానికి ముందు వరకు 50 శాతం మాత్రమే వ్యవసాయ పనులు జరిగాయి. దీంతో కరువు ఒకపక్క ఫ్యాక్షన్, ఉపాధి కోసం వలసలు వెళ్లక తప్పలేదు. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు పనుల కోసం కుటుంబాల కుటుంబాలే వలస వెళ్లాయి. ఆ విధంగా 350 కుటుంబాల్లో ఇళ్ళని ఖాళీగా కనిపించాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో కప్పట్రాళ్ల గ్రామ ప్రజలకు బ్యాంకులో రుణాలు ఇచ్చేవి కాదు. ఈ ఊరికి కోడలిగా పంపించడానికి కూడా ఎవరో సాహసించలేదు. రుణాలు అందక, ఫ్యాక్షన్ గొడవల్లో దాదాపు అనేక కుటుంబాల చెక్కుకున్న మొత్తానికి గ్రామంలో 915 కుటుంబాలు తల్లడిల్లాయి.
రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి. అందులో కప్పట్రాళ్ల గ్రామం అనేది వార్తల్లో ప్రముఖంగా వినిపించేది. ఓవర్గా నాయకుడు కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు మరణం తర్వాత చాలా సంఘటన జరిగాయి అంతకు ముందు చోటుచేసుకున్నాయి. దాదాపు 40 సంవత్సరాలకు పైగానే ఈ గ్రామంలో జరిగిన హత్యలు దాడులు కారణంగా అనేక మంది చనిపోతే బాంబుల దాడుల్లో అనేకమంది వికలాంగులకు మారారు. హత్యలు దాడులతో కర్నూలు జిల్లాలో అనేక ప్రాంతాలతో పాటు కప్పట్రాల నిత్యం వార్తల్లో ఉండేది

కొత్త మలుపు ... సరికొత్త జీవనం..

సరిగ్గా ఇదే సమయంలో 2015 వ సంవత్సరంలో కర్నూలు జిల్లా ఎస్పీగా ఆకే రవికృష్ణ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన నార్కోటిక్స్ విభాగం ఐజీగా ఉన్నారు. కర్నూలు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రవికృష్ణ కప్పట్రాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడి ప్రజలతో పోలీసు యంత్రాంగాన్ని మమేకం చేశారు.

మాటల మంత్రం...

కప్పట్రాళ్ల గ్రామంలో పెద్దలకు కౌన్సిలింగ్ చేసి ఫ్యాక్షన్ వల్ల జరిగిన నష్టాలను వివరించారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలని వారిలో ప్రేరణ కలిగించారు. గతాన్ని నెంబర్ వేసుకున్న కప్పట్రాళ్ల గ్రామ ప్రజలు కూడా అనేకమంది తమ స్థితిని చూసి ఆలోచనలో పడ్డారు. ఇక్కడ ప్రధానంగా వ్యవసాయ పనులు గాడి తప్పిన స్థితిలో నేటి ఆధారం లేకపోవడం వల్ల పనులు మానుకొని వర్గ నాయకుల చుట్టూ తిరుగుతూ వారికి రక్షకులుగా అనేకమంది అమాయకులు బలయ్యారు. ఇదే అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని అప్పటి కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ పోలీసు సిబ్బందితో అక్కడి ప్రజల మనసులను మార్చడానికి చేసిన ప్రయత్నాల వల్ల సత్ఫలితాలు సాధించగలిగారు. దీనికోసం పోలీసులు లాఠీలు కాఠిన్యాన్ని ప్రదర్శించలేదు. లౌక్యాన్ని ప్రదర్శించి మంచి మాటలతో జీవితం విలువను చెప్పడమే కాదు. పిల్లల భవిష్యత్తును కూడా గుర్తు చేసి పెద్దలను మానసికంగా ఆలోచనలో మార్పు తీసుకురావడానికి జరిగిన ప్రయత్నం వల్ల కప్పట్రాళ్ల గ్రామానికి రవికృష్ణ దేవుడయ్యారంటే అతిశయోక్తి కాదు.

నాలుగు సూత్రాలు

కప్పట్రాళ్ల గ్రామంలో ఫ్యాక్షన్ మరకలు చెరిపివేసి ఆధునిక జీవనం వైపు అడుగులు వేయించడంలో గ్రామంలో బ్యాంకు ఏర్పాటు చేయడం వెనుక నాలుగు ప్రధాన అంశాలు కనిపిస్తాయి.
1) శ్రీశైలం రైట్ బ్రాంచ్, కెనాల్ నుంచి పందికోన రిజర్వాయర్ ద్వారా నీటిని తీసుకురావడం,
2) మహిళా సంఘాల ఏర్పాటు, రైతు సంఘాల ఏర్పాటు. పొదుపుతో రూ.200 కోట్ల టర్నోవర్.
3 ) రైతుల కోసం కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటు
4 ) గ్రామంలో జెడ్పీ హైస్కూల్ పాఠశాల ఏర్పాటు చేయించడం. (
పోలీసులే చొరవ తీసుకొని జెడ్పీ హై స్కూల్ ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం ఇక్కడ 400 మంది విద్యార్థులు చదువుతున్నారు.)

ఐపీఎస్ అధికారి కోసం పూజలు..

రెండు రోజుల కిందట ప్రస్తుతం నార్కోటెక్స్ విభాగం ఐజి రవికృష్ణ పుట్టినరోజును కప్పట్రాళ్ల గ్రామంలో ఓ పండుగలా నిర్వహించారే. అంటే అక్కడి ప్రజలు ఏ స్థాయిలో మార్పు చెందారు? పోలీసులు అంటే ఒక గౌరవాన్ని ఇనుమడింప చేయడంలో కూడా కప్పట్రాళ్లలో తీసుకువచ్చిన పరివర్తన అనేది ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అని చెప్పడంలో సందేహం లేదు.

కప్పట్రాళ్ల ఎలా ఉంది..?

కప్పట్రాళ్ల గ్రామానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం అనేది ఒక సాహసంగా మారి ఏ బ్యాంకు ముందుకు రాలేదు. పోలీసుల కౌన్సిలింగ్ తర్వాత కొంత మంది వడ్డీలకు రుణాలు ఇచ్చిన పెట్టుబడి పెడితే మళ్లీ వచ్చిన దిగుబడి వారికే విక్రయించడం వల్ల రైతులకు నష్టం జరిగేది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి ప్రాపర్టీ కర్నూలు ఎస్పీగా ఉన్న సమయంలో రవి కృష్ణ బ్యాంకు అధికారులతో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకోవడం ద్వారా కప్పట్రాళ్లలోనే రాయలసీమ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు చేయించారు. మహిళా రైతు సంఘాలను ఏర్పాటు చేయించి పొదుపును నేర్పించారు.
రుణాలు ఇవ్వడానికి వెనుకంజ వేసిన బ్యాంకు గ్రామానికి వస్తే అందులో 200 కోట్ల రూపాయలు టర్నోవర్ జరిగే స్థాయికి గ్రామం పురభివృద్ధి సాధించింది.

ఉద్యోగుల సంఖ్య..

బాంబుల మూతతో కత్తుల స్వైర విహారంతో రక్తపుటేరిలు పారిన కప్పట్రాళ్ల గ్రామంలో విద్యా కుసుమాలు విరిసాయి 8 మంది టీచర్లుగా ఎంపికయ్యారు ఐదుగురు సచివాలయ ఉద్యోగులుగా ఎంపికయ్యారు ఎన్జీవో సెక్టార్ లో సుమారు 50 మందికి పైగానే ఉద్యోగాలు సాధించి ప్రైవేటు సంస్థల్లో ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న స్థాయికి వెళ్లి కప్పట్రాళ్ల స్వరూపాన్ని మార్చి వేశారు

పని ఉంటే మరో ధ్యాస ఉండదు

కప్పట్రాళ్ల గ్రామము కాదు ఫ్యాక్షన్ రాజ్యమేలిన ప్రాంతాలలో చేతినిండా పని ఉంటే తమ కుటుంబాల బాగు కోసం భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తారు. అదే పరిస్థితి పోలీసులు అది కల్పించారు దీనికోసం 2019లో జిల్లా కలెక్టర్ విజయమోహన్ సహకారంతో శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ ( Srisailam Right Branch Canal ) నుంచి పందికోన రిజర్వాయర్ ( Pandikona Reservoir ) కు నీరు తీసుకువచ్చారు. అక్కడ నుంచి కప్పట్రాళ్ల గ్రామానికి మీదుగా కాలువలు ఏర్పాటు చేసి సేద్యపు నీరు పారించడం వల్ల 2,500 ఎకరాల్లో సాగులోకి వచ్చింది. పూర్తిస్థాయిలో వ్యవసాయం అదుపులోకి వచ్చింది. దీనివల్ల గ్రామంలోని 1300 బోర్లు రీచార్జ్ అయ్యాయి. పాడైపోయిన 500 బోర్లు కూడా వినియోగం లోకి వచ్చాయి.
గ్రామంలో డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం కల్పించడంతో ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. తద్వారా పండ్లతోటల పెంపకానికి బాటలు వేశారు.
"నేచురల్ ఫార్మింగ్ మెథడ్ ప్రారంభించాం" అని గ్రామజ్యోతి సంస్థ సీఈఓ నాగరాజు చెప్పారు.
పాడి పరిశ్రమ ద్వారా కూడా 50 నుంచి 60 కుటుంబాలకు పాడి ఆవులు పట్టించి, పాల దిగుబడిలో కూడా విజయం సాధించారు. మొదట విజయ డైరీ కి పాలు సరఫరా చేయడానికి గ్రామంలోనే బల్క్ చిల్లింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన ఆ తర్వాత అది మూత పడింది.
"కప్పట్రాళ్ల గ్రామంలో ఒకప్పుడు సేద్యం 50% కూడా జరిగేది కాదు. సాగునీరు అందుబాటులోకి రావడం వల్ల దిగుబడి పెరిగింది. వేరుశనగ ఇతర ఉద్యానవన పంటలను నిలువ చేయడానికి 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయించాం" అని నాగరాజు వివరించారు.

కోడలిగా పంపడానికి ఇష్టపడని ఊరిలో కళ్యాణమండపం

కప్పట్రాళ్లలో ఫోటో చేసుకున్న వర్గ పోరు కారణంగా ఈ గ్రామానికి కూడలిగా పంపడానికి ఎవరూ సాహసించలేదు. పరిస్థితిలో వచ్చిన మార్పు కారణంగా కప్పట్రాళ్ల గ్రామంలో ఏకంగా ప్రత్యేకంగా కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన తీరువల్ల గ్రామంలో ఎనిమిది బయో గ్లాస్ ప్లాంట్లో కూడా ఏర్పాటు చేసుకునే విధంగా పాడి పరిశ్రమ భూతంతో ఇది సాధ్యమైంది అని ఇక్కడి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న బి నారాయణ చెబుతున్నారు.
కపటాల గ్రామ మెకాకుండా సమీప ప్రాంతాల్లో ఎర్ర రేగడి నేలలు 80% ఉన్నాయి
రైతులు సాగించిన దిగుబడులు అంటే వేరుశనగ బుడ్డలు ఇతర పంటలను విక్రయించడానికి ప్రయత్నం చేస్తే పెట్టుబడి డబ్బు ఇచ్చిన వ్యక్తికే అమ్మాలి అనే శరత్ వల్ల రైతులు నష్టపోతున్నారు దీనివల్ల రైతులకు ఏమాత్రం నష్టం కష్టం కలిగించని విధంగా దిగుబడి అంతా ఒకేసారి పోగొచేసి మార్కెట్ యార్డుకు తరలించడం ద్వారా విక్రయించి రైతులకు ఆ సొమ్ము అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నామని కూడా నారాయణ చెబుతున్నారు.
Read More
Next Story