22 (ఏ) చట్రం: పేదలకు ఉరితాడుగా మారిన వైనం ...

పుంగనూరు:ఫార్ములా అమలు చేస్తే... 25 లక్షల ఎకరాల పేదల భూములకు విముక్తి..


దశాబ్దాలుగా అనుభవంలో ఉన్న భూములు నిషేధిత జాబితాలోకి చేర్చడం వల్ల పేదల బతుకుపై దెబ్బ పడింది. వంశ పారంపర్య అనుభవంలోని ఆస్తులను నిషేధిత 22ఏ జాబితాలో చర్చడం పేదల జీవితాలకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. ఆ భూములు దక్కించుకునేందుకు జీవితకాలం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పేదల భూములు అనడం కంటే పేదలై గద్దలుగా మారిన కొందరు పెద్దలు వివాదాలు సృష్టించి, తక్కువ ధరకు కొట్టేసేందుకు 22 ఏ నిషేధిత చట్టం అస్ర్తంగా మారింది.

అసైన్డ్ భూములు, ఇనాం భూములు, ఫ్రీహెల్డ్, 22 (ఏ)కు మధ్య ఉన్న వ్యత్యాసంపై జస్టిస్ నాగార్జునరెడ్డి 2014 ఏప్రిల్‌లో 150 పేజీల్లో ఇచ్చిన తీర్పు ఏమిటి? ప్రభుత్వాలు ఆ తీర్పును పట్టించుకుంటున్నాయా? ఈ పరిస్థితుల్లో పేద రైతుల మానసిక వేదన ఎలా ఉంది. వారి కోసం సెంటర్ ఫర్ లిబర్టీ సాగిస్తున్న పోరాటం ఏమిటి? అనే వివరాలు ఈ వీడియోలో చూడండి.

చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని ఆవులపల్లె సమీపంలో 910 ఎకరాలు 22 ఏలో చేర్చారు. తద్వారా వైసీపీ నేతకు ధారదత్తం చేయడానికి ప్రయత్నం జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క జీఓతో బద్దలు కొట్టింది.
"ఇదే ఫార్ములా రాష్ట్రంలో అమలు చేస్తే దాదాపు 14 లక్షల ఎకరాలకు విముక్తి కలుగుతుంది. పేద బడుగు, బలహీనవర్గాల రైతులకు మేలు జరుగుతుంది" అని సెంటర్ ఫర్ లిబర్టీ () సంస్థ వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారం ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి సూచించారు. వాస్తవానికి నిషేధిత భూముల జాబితాలో సుమారు 25 లక్షల ఎకరాలకు పైగాన చేర్చారనేది ప్రాథమిక సమాచారం.

మదనపల్లె ఘటనతో తెరపైకి..

జులై 21, 2024న చోటుచేసుకున్న రెవెన్యూ రికార్డుల దగ్ధం ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రం)లో 2024 జూలై 21వ తేదీ జరిగిన రెవెన్యూ రికార్డులు దగ్ధం ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తరువాత
అవులపల్లె 22ఏ భూముల వ్యవహారం తోపాటు అనేక సంఘటనలు వెలుగు చూశాయి. ఈ వ్యవహారంలో అప్పటి ఆర్డీఓ హరిప్రసాద్, అంతకుముందు పనిచేసిన ఆర్డీఓ మురళీ తోపాటు సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ్ సహా ఇంకొందరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇందులో వైసీపీ నేతలు మాధవరెడ్డి, రిటైర్డ్ టీచర్, పుంతనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పీఏగా పనిచేసిన తుకారం తదితరులను కూడా సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..

"అవులపల్లె తరహాలో

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆవులపల్లె భూములను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఒక్క ఆదేశంతో నిషేధిత జాబితా నుంచి తొలగించడం హర్షణీయం. రాష్ట్రంలోని 14 లక్షల ఎకరాలకు పైగా ఉన్న భూములకు ఎప్పుడు విముక్తి కల్పిస్తారు" అని రిటైర్డ్ ఐపీఎస్ అధికారం ఏబీ వెంకటేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు.
2014లో కూడా భూములు కంప్యూటరీకరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అదే పని చేశారు. కానీ, క్షేత్ర స్థాయిలో వీఆర్ఓలు యథాతధంగా భూముల వివరాలు ఎక్కించకుండా, 2017 సంవత్సరం నాటి అడంగల్ ప్రామాణికంగా తీసుకుని కంప్యూటర్ లోకి ఎక్కించడం వల్ల వ్యవస్థలోనే తప్పదానికి పాల్పడ్డారని కూడా వెంకటేశ్వరరావు చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో జరిగిన తప్పిదాన్ని ఎత్తి చూపించారు.

జస్టిస్ నాగార్జునరెడ్డి తీర్పే శిలాశాసనం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014 ఏప్రిల్ నెలలో హైకోర్టు జడ్జి జస్టిస్ నాగార్జున రెడ్డికి 500 నుంచి 600 కేసులు వచ్చాయి దీనిపై సమగ్రంగా పరిశీలించిన జస్టిస్ నాగార్జున రెడ్డి 150 పేజీలో తీర్పు చెప్పారు. ఈ తీర్పుపై ప్రస్తుత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అప్పీలకు పోలేదు .దీనివల్ల జస్టిస్ నాగార్జున రెడ్డి ఇచ్చిన జడ్జిమెంట్ ఫైనల్. ఇదిలావుంటే..
గ్రామాల్లో పెత్తందారులు, జమీందారులు దేవుడి పేరిట దానాలు అర్చకులు చాకలి మంగలి టీచర్లకు జమీందారులు భూములు పంపిణీ చేశారు. దీనిని ఇనాం భూములుగా ప్రస్తావించారు. అయితే, 1948లో ఇనాం భూముల యాక్టివ్ రద్దు చేశారు సేద్యం చేసుకునే వారికి హక్కులు కల్పించారు. ఆ తర్వాత రైతు వారి పట్టాలు సేద్యం చేస్తున్నట్లు పట్టాలిచ్చారు. భూమి పైన హక్కు టైటిల్ హక్కు కల్పించారు

2014లో భారీ తప్పిదం..

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు సమస్యల పరిష్కారానికి భూమి రికార్డులను కంప్యూటర్ కరుణ చేయడం ద్వారా సమస్య పరిష్కరిస్తామని చెప్పడమే కాదు. చేశారు కూడా. దీనికోసం భూ రికార్డులు కంప్యూటరీకరణ చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడే వ్యవస్థలో లోపం జరిగిందని సెంటర్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకుడు ఏబీ. వెంకటేశ్వరరావు ఆరోపించార.
"వీఆర్వో స్థాయి అధికారులు రైతుల ఆధీనంలోని పట్టాలు, ఇతర భూములను అనుభవిస్తున్న వారి వివరాలను యధాతధంగా కంప్యూటరీకరణ చేయలుదు. 2015 నాటి అడంగల్ ఆధారంగా ఉన్న వారి పేర్లు కాకుండా 1907 -08 కాలంలో ఆర్ఎస్ఆర్ ఆధారంగా పట్టుకొని రైతుల ఆధీనంలోని పట్టాభిములు ఇతర ఇనాం భూములను కూడా ప్రభుత్వ భూములు" అని రాయడం వల్ల మరింత వివాదాస్పదం చేశారు అనేది మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వ్యక్తం చేసిన అభ్యంతరం.

వైసీపీ ప్రభుత్వంలో కుట్ర..

రాష్ట్రంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో కూడా కుట్ర జరిగిందనేది ఏబీ. వెంకటేశ్వరరావు చెబుతున్న మాట.
"20 ఏళ్లుగా భూములు అనుభవంలో ఉంటే, వాటికి రైతులే యజమానులు, విక్రయాలు చేసుకోవచ్చని ఆదేశాలిచ్చారు. రూరల్ ప్రాంతం పట్టణీకరణ వల్ల భూముల ధరలు పెరిగాయి. దీంతో 12 ఏళ్ల అనుభవాన్ని ప్రామాణికంగా 22 (ఏ) అస్ర్తం ప్రయోగించారు" అని వేంకటేశ్వరరావు ఆరోపించారు. దీనికి ప్రధానంగా నిషేధిత జాబితా నుంచి భూములకు విముక్తి కల్పించాలంటే నాకే విక్రయించాలి. అది కూడా నేను చెప్పిన ధరకే అనే షరతు విధించిన కొందరు నేతలు పేదలను కష్టాల్లోకి నెట్టారని వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు.

తహసీల్దార్ తప్పు చేస్తే..

ఒత్తిడి కావచ్చు. మరో రకమైన కారణమైనా. పొరబాటుగా రైతు ఆధీనంలోని భూములు నిషేధిత 22ఏ పరిధిలోకి తహసీల్దార్ చేర్చారే అనుకుందాం. మళ్లీ వాటికి విముక్తి కల్పించే అధికారం, బాధ్యత ఆయనకు ఉండదు. ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ ఏ కాకుండా ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. అంటే మంత్రి మండలి.
"ఆ స్థాయికి వెళ్లి పేద రైతు పోరాటం సాగించగలరా? "అని సీఎల్ఎఫ్ వ్యవస్థాకుడు ఏబీ. వెంకటేశ్వరరావు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
కర్నూలు జిల్లా చిన్నటేకూరులో కూడా 131 మంది బాధిత రైతులు ఉన్నారు. సన్న చిన్న కారు రైతులైన వారంతా ప్రభుత్వం వరకు వెళ్లే స్తోమత లేదు పోరాడే శక్తి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read More
Next Story