తిరుపతి ఏపీఎస్సీడీసీఎల్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేస్తున్న విద్యుత్ శాఖ బిల్ కలెక్టర్ల కుటుంబీకులు
అమ్మానాన్నల దీక్షలో పసిపిల్లలు
విద్యుత్ శాఖలో సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను తొలగించవద్దని కోరుతూ బిల్ కలెక్టర్లు కుటుంబాలతో సహా తిరుపతిలో నిరసన దీక్షలు సాగిస్తున్నారు. ఎస్పీడీసీఎల్ (AP Power Distribution Company Limited APSPDCL )లో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లను సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తొలగించాలనే యాజమాన్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలోని ఆ సంస్థ కార్పొరేట్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద పత్తికొండ ఈఆర్ఓ, కర్నూలు ఈఆర్ఓ పరిధిలోని బిల్ కలెక్టర్లు కుటుంబాలతో సహా పాల్గొన్నారు. బిల్ కలెక్టర్లతో పాటు భార్య, పిల్లలతో కలిసి నిరసనలు సాగిస్తున్నారు. ఈ దీక్షా శిబిరంలో ఏడాది వయసు నుంచి ఊహ తెలిసిన పిల్లలు కూడా కనిపిస్తున్నారు.
"మా తండ్రులకు ఉపాధి తీయవద్దు. ఫీజులు కట్టడానికి ఇబ్బంది అవుతుంది" అని కొందరు పిల్లు అక్కడికి వెళ్లిన మీడియా వద్ద వ్యాఖ్యానించారు.
"ఇంకొందరు పిల్లలు తల్లిదండ్రులతో కలిసి మెడలో దీక్షా మాలలు వేసుకుని కూర్చొన్నారు."
“పసిపిల్లల కన్నీళ్లు చూసైనా స్పందించండి — బిల్ కలెక్టర్ల కుటుంబాలను ఆదుకోండి” అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళీ కోరారు.
Next Story

