x

జీఎస్ఎల్వి రాకెట్‌ ఎందుకు 'నాటీ బాయ్' గా మారింది..!

ఇస్రో శాస్ర్తవేత్తలు ఎందుకు ఆ పేరు పెట్టారు. సూపర్ బాయ్ గా ఎలా మారింది?


శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించే ప్రతి రాకెట్ కు ఓ గుర్తింపు ఉంది. పీఎస్ఎల్ వి అత్యంత నమ్మకమైన వర్క్ హూర్స్ (Workhorse) గా గుర్తింపు సాధించింది. జీఎస్ఎల్ వీ మాత్రం కొన్నేళ్ళ పాటు శాస్త్రవేత్తలు సరదాగా నాటీ బాయ్ అని పేరు పెట్టారు. అంటే ఇది తుంటరి మిషన్ అని అర్థం. ఇంత పెద్ద రాకెట్ కు నాటీ బాయ్ అని పేరు ఎందుకు వచ్చింది.

ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె. శివన్ ఓ సందర్భంలో సరదాగా జీఎస్ఎల్వి రాకెట్‌ను 'నాటీ బాయ్' అని వ్యాఖ్యానించారు.
దానికి ప్రధాన కారణాలు ఇవీ..

అస్థిరమైన విజయాలు (Unpredictable Track Record): PSLV వరసపెట్టి వరుస విజయాలు సాధిస్తుంటే, GSLV మాత్రం ఒక్కోసారి ఊహించని రీతిలో మిషన్ మధ్యలో విఫలమయ్యేది. ఒక ప్రయోగం విజయవంతమైతే, తదుపరి ప్రయోగం విఫలమయ్యేది. దీనికి కారణం క్రయోజనిక్ ఇంజిన్ లో సవాళ్లు ఎదురయ్యాయి. GSLV రాకెట్ మూడో దశలో 'క్రయోజెనిక్ ఇంజిన్' ఉపయోగిస్తారు. మైనస్ 250 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవ ఉజ్వలపాతం (Liquid Hydrogen), ద్రవ ఆక్సిజన్‌ను నిర్వహించడం ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన సాంకేతికత. ప్రయోగం చివరి నిమిషంలో ఈ ఇంజిన్ పనిచేయకపోవడం లేదా ఒత్తిడి తగ్గడం వల్ల మిషన్లు దెబ్బతినేవి.

ఇవీ ఆ సంఘటనలు

2010 (GSLV-F06): ప్రయోగించిన కొద్ది సెకన్లకే రాకెట్ నియంత్రణ కోల్పోయి గాల్లోనే పేలిపోయింది.
2021 (GSLV-F10/EOS-03): క్రయోజెనిక్ దశలో ఒత్తిడి తగ్గడం వల్ల ప్రయోగం విఫలమై ఉపగ్రహం సముద్రంలో పడిపోయింది.
ప్రారంభంలో చేసిన 15 ప్రయోగాల్లో దాదాపు 4 మిషన్లు పూర్తిగా విఫలమవ్వడం, మరొకటి పాక్షికంగా దెబ్బతినడమే దీనికి ఆ పేరు రావడానికి కారణం.

నాటీ బాయ్ ఎలా 'డిసిప్లిన్డ్ బాయ్'గా మారాడు?

జీఎస్ ఎల్ వీ రాకెట్ల ప్రయోగంతో ఇస్రో శాస్త్రవేత్తలు కుంగిపోలేదు. వైఫల్యాలు ఎదురైనా ఇస్రో శాస్త్రవేత్తలు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ప్రతి వైఫల్యం నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నారు. అది కూడా క్రయోజెనిక్ ఇంజిన్ లోపాలను స్వదేశీ సాంకేతికతతో పూర్తిగా సరిదిద్దారు. రాకెట్ లోని సెన్సార్లు, ఇంధన సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేశారు.
ఆ తర్వాత వరుసగా INSAT-3DS, నావిగేషన్ ఉపగ్రహాలు (NVS-01), మరియు EOS-05 (GISAT-1A) వంటి అత్యంత కీలకమైన, వేల కోట్ల విలువైన శాటిలైట్లను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
"ఒకప్పుడు తుంటరి చేష్టలతో భయపెట్టిన ఈ 'నాటీ బాయ్', నేడు భారత్ గర్వపడే అత్యంత విశ్వసనీయ రాకెట్లలో ఒకటిగా నిలిచింది. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే విజయం ఖాయమని ఇస్రో జీఎస్ఎల్వి ప్రయాణం నిరూపించింది!
Read More
Next Story