చంద్రబాబు ప్రచారం చేసిన చోట పరిస్థితి ఎలా ఉందంటే...
x

చంద్రబాబు ప్రచారం చేసిన చోట పరిస్థితి ఎలా ఉందంటే...

బాబు ప్రచారం వల్ల కూటమికి ఓట్లు పెరిగాయా లేక తరిగాయా?


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ (AIADMK+BJP కూటమి) తరపున రెండు రోజుల (ఏప్రిల్ 20-21) ఉధృత ప్రచారం చేశారు. తమిళనాడు-ఆంధ్ర సాంస్కృతిక సంబంధాలను, అభివృద్ధి రాజకీయాలను హైలైట్ చేస్తూ ఆయన వివిధ ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. కొన్ని చోట్ల పారిశ్రామిక వేత్తలతో సభలు, సమావేశాలు పెట్టారు. చెన్నైలో ఓ చోట రోడ్ షో నిర్వహించారు.

చంద్రబాబు ప్రచారం చేసిన ముఖ్య నియోజకవర్గాలు..

కోయంబతూర్ (నార్త్, సౌత్, సింగనల్లూరు, సూలూరు, కవుండమ్ పాళ్యం ప్రాంతాలు)
థల్లి— కృష్ణగిరి జిల్లా,
హోసూర్, అవాడి (చెన్నై ప్రాంతంలో రోడ్‌షో)
సత్తూర్- విరుధునగర్ జిల్లా,
మదురై ప్రాంతం (సత్తూరు సమీపంలో)
చంద్రబాబు “డబుల్ ఇంజిన్” పాలన, అభివృద్ధి, మహిళల రిజర్వేషన్, డీలిమిటేషన్ వంటి అంశాలపై దృష్టి సారించి ప్రచారం చేశారు.

చంద్రబాబు ప్రచారం- కూటమి ఫలితాలు..

హోసూర్ (Hosur): చంద్రబాబు ఇక్కడ ఎన్.డి.ఏ (AIADMK-BJP) అభ్యర్థి విజయం కోసం భారీ రోడ్ షో నిర్వహించారు. AIADMK అభ్యర్థి బలకృష్ణ రెడ్డి పోటీ. అయితే, ఇక్కడ టీవీకే (TVK) అభ్యర్థి విజయం సాధించారు. బాబు ప్రచారం వల్ల కూటమికి ఓట్లు పెరిగినప్పటికీ, విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు.
కోయంబతూర్ (Coimbatore North & South): ఇక్కడ బీజేపీ అభ్యర్థుల కోసం ఆయన ప్రచారం చేశారు. తాజా ట్రెండ్స్ ప్రకారం కోయంబతూర్ సౌత్ లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ బాబు ప్రభావం కొంత సానుకూలంగా కనిపిస్తోంది.
థల్లి (Thalli): ఇక్కడ కూడా కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం సాగింది. అయితే CPI అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
అవాడి (Avadi): చంద్రబాబు ఇక్కడ రోడ్ షో నిర్వహించారు. కానీ ఇక్కడ కూడా టీవీకే (TVK) అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
మదురై & సత్తూర్: ఇక్కడ బాబు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల డీఎంకే, మరికొన్ని చోట్ల టీవీకే అభ్యర్థులు బలంగా కనిపిస్తున్నారు.
సత్తూర్ (Sattur): చంద్రబాబు ప్రధానంగా ప్రచారం చేసిన సీటు. BJP అభ్యర్థి నయినార్ నాగేంద్రన్ బలమైన పోటీ ఇచ్చినా, ఫలితం టైట్ ఫైట్‌గా ఉంది (TVK/DMK మధ్య తీవ్ర పోటీ నెలకొంది).
చంద్రబాబు నాయుడు ప్రధానంగా తెలుగు ఓటర్లను లక్ష్యంగా చేసుకుని అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఆయన ప్రచారం వల్ల కూటమికి ఓటు శాతం మెరుగుపడినప్పటికీ, చాలా చోట్ల విజయ్ (TVK) ప్రభంజనం ముందు ఆ ప్రభావం తేలిపోయినట్టు కనిపిస్తోంది.
(కౌంటింగ్ నడుస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు).
Read More
Next Story