
అయ్యో, పవన్ కల్యాణ్ కి ఏమైందీ? ఎందుకు ఆస్పత్రిలో చేరారు?
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది,,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయనకు, వైద్యుల సూచన మేరకు ఈ సర్జరీ నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే తన వ్యక్తిగత వైద్యులను సంప్రదించిన ఆయన, వారి సలహా మేరకు ఆనాటి అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని ఆస్పత్రికి వెళ్లారు.
వైద్య పరీక్షలు, శస్త్రచికిత్స
ఆస్పత్రిలో పవన్ కల్యాణ్‌కు పలు వైద్య పరీక్షలతో పాటు MRI స్కాన్ కూడా నిర్వహించారు. నివేదికలను పరిశీలించిన వైద్య బృందం, తక్షణమే శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయనకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.
శస్త్రచికిత్స అనంతరం పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై వైద్యులు కీలక సూచనలు చేశారు. కనీసం 10 రోజుల పాటు పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలి. పూర్తి స్వస్థత చేకూరడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలం పాటు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు స్పష్టం చేశారు. "పవన్ కల్యాణ్ గారు పూర్తి ఆరోగ్యవంతులు కావడానికి మరికొంత కాలం పడుతుంది. పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు, కానీ ఆయన విశ్రాంతి తీసుకోవడం అత్యవసరం." అని పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తెలిపారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Next Story

