
రైల్వే కోడూరు నియోజవర్గం ఓబులవారిపల్లెలో టెంకాయ కొట్టనున్న సీఎం నారా చంద్రబాబు (ఏఐ ఫోటో)
VB- GRAM | అనుకున్నది సాధించిన పవన్ కల్యాణ్..!
ఉపాధి హామీ పథకం మళ్లీ ప్రారంభంతో జాతీయ వార్తల్లో నిలవనున్న రైల్వే కోడూరు.
జాతీయ స్థాయిలో రైల్వే కోడూరు నియోజకవర్గం వార్లల్లో ప్రముఖంగా నిలువబోతోంది., వీబీజీ రాంజీ (మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం - NREGS ) గా పేరు మారిన పథకానికి జూలై రెండో తేదీ మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ విషయంలో జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనుకున్నది సాధించారు.
దీనికి రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలంలోని గ్రామం వేదికగా నిలవబోతోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శివరాజ్ సింగ్ హాజరయ్యే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, మంత్రులు హాజరుకానున్నారు. ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ ఇన్ చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి తో కలిసి సమీక్షించారు.
దేశంలో మొదటిసారి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో చైర్ పర్సన్ సోనియోగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి
2006 ఫిబ్రవరి రెండో తేదీ అనంతపురం జిల్లా బండ్లపల్లెలో శ్రీకారం చుట్టారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చిన విషయం తెలిసిందే. వీబీ జీ రాంజీ ( వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ గార్ అజీవిక మిషన్ గ్రామీణ్) పథకాన్ని మళ్లీ రాయలసీమ నుంచి ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు.
ఈ పథకాన్ని దేశంలో మొదట ఏపీ నుంచి అది కూడా రాయలసీమ నుంచే ప్రారంభించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది. ఈ విషయంలో గత వారం ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాట్లాడి, అనుకున్నది సాధించడంలో సఫలం అయ్యారు.
టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరిగిన స్వల్ప జిల్లాల పునర్విభజన వల్ల కడప జిల్లా పరిధిలో ఉన్న రైల్వే కోడూరు నియోవజకవర్గం తిరుపతి జిల్లాలోకి మారింది. ప్రస్తుతం రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. (ప్రస్తుతం ఆయన పార్టీ నుంచి సస్పెన్షన్ లో ఉన్నారు). కానీ,
రైల్వే కోడూరు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న ముక్కా రూపానందరెడ్డికి అనుచరుడే ఎమ్మెల్యే అరవ శ్రీధర్. వారిద్దరిదీ ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లె కావడం గమనార్హం. టీడీపీ కూటమి మిత్రత్వాన్ని చాటుకునే విధంగా, రాష్ట్రంలో ఆ పార్టీల మధ్య సఖ్యతను చాటుకునే విధంగానే రాయలసీమ నుంచి అది కూడా తిరుపతి జిల్లాలో ఉన్న రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి వీబీ జీ రాంజీ గ్రామీణ ఉపాధి పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
రైల్వే కోడూరు నియోజవవర్గం ఓబులవారిపల్లెలో బరైటీస్ (ముగ్గురాళ్ల గనులతో ప్రపంచ మార్కెట్ ను ప్రభావితం చేసే స్థాయిలో గుర్తింపు సాధించింది. వీబీ జీ రాంజీ పథకం ప్రారంభంతో ఈ ప్రాంతం జాతీయ స్థాయి వార్తల్లో నిలవడానికి మళ్లీ అవకాశం కలిగింది.
(ఆ వివరాలేమిటో ఈ వీడియోలో చూడండి)
Next Story

