
ఎస్ఆర్ఎం అమరావతి క్యాంపస్‌లో ఏఐ ఆధారిత రెండు కొత్త కోర్సులు
టెక్ రంగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఎస్ఆర్ఎం అడుగులు.
ఎస్ఆర్ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (SRM University) అమరావతి క్యాంపస్‌లో కృత్రిమ మేధ (Artificial Intelligence - AI) ఆధారిత రెండు కొత్త ప్రోగ్రాములను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త కోర్సులు ఆధునిక సాంకేతికతలో యువతను సమర్థవంతంగా తీర్చిదిద్ది, ఉపాధి అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా
రూపొందించారు.
విజయవాడలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీసీ ఆచార్య సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడారు. “ప్రపంచం AI యుగంలోకి వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో, మా విద్యార్థులు ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో బయటపడాలని మేము కోరుకుంటున్నాం. ఈ కొత్త కోర్సులు ఆ దిశలో మా కృషి” అని వ్యాఖ్యానించారు. ఏఐ తో సమ్మిళితమైన ఎమ్మెస్సీ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ సైకాలజీలో ఈ కోర్స్ లు ప్రారంభింస్తున్నారు. అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు వీసి తెలిపారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు పెట్టింది పేరు కార్నెగీ మెలన్ యూనివర్సిటీ. ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కార్నెగీ మెలన్ యూనివర్సిటీతో ఎంఓయూ చేసుకుని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఏఐలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటి వరకు పది మంది ప్రొఫెసర్లు ఏఐ లో శిక్షణ పూర్తి చేసుకున్నారని చెప్పారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇనిస్టిట్యూషన్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెస్సీ సైకాలజీ, ఎకనామిక్స్ కోర్స్ లు ఏఐ ఆధారిత బోధనలో అందుబాటులోకి వచ్చాయి.
ఈ కోర్సులు ప్రస్తుత సాంకేతిక పోకడలకు అనుగుణంగా రూపొందించామని, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, బిగ్ డేటా టెక్నాలజీలు, ఎథికల్ AI వంటి అత్యాధునిక అంశాలను కవర్ చేస్తాయని యూనివర్సిటీ వైఎస్ చాన్స్ లర్ సతీష్ కుమార్ తెలిపారు.
కొత్త కోర్స్ ల బ్రోచర్ ను రిలీజ్ చేసిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అధికారులు
ప్రత్యేకతలు
ఇండస్ట్రీ భాగస్వామ్యంతో ప్రాక్టికల్ ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు
అంతర్జాతీయ స్థాయి ఫ్యాకల్టీ, అత్యాధునిక ల్యాబులు
ఉద్యోగ అవకాశాలు: AI Engineer, Data Scientist, Machine Learning Specialist, AI Research Scientist వంటి హై-డిమాండ్ ఉద్యోగాలు
అమరావతి క్యాంపస్‌లోనే అందుబాటు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యం.
ఆసక్తి ఉన్న విద్యార్థులు SRM University అధికారిక వెబ్‌సైట్ లేదా అమరావతి క్యాంపస్ అడ్మిషన్ కార్యాలయంను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.
ఫీజుల్లో రాయితీలు...
నాలుగేళ్ల గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగిన విద్యార్థులు ఒక సంవత్సరం ప్రోగ్రాం, మూడేళ్ల కాలపరిమితి డిగ్రీ కలిగిన వారికి రెండు సంవత్సరాల ప్రోగ్రాం ఉంటుంది. డిగ్రీలో 60 శాతం మార్కులు వచ్చిన వారు అర్హులని, సీజీపీఏ 9.0 పైబడిన వారికి ట్యూషన్ ఫీజులో నూరు శాతం రాయితీ ఇస్తారు. సీజీపీఏ 8.0 నుంచి 8.9 వరకు ఉంటే 75 శాతం ఫీజు రాయితీ, సీజీపీఏ 7.0 నుంచి 7.9 వరకూ ఉంటే వారికి 50 శాతం ఫీజు రాయితీ ఇస్తారు.
ఈ కొత్త కోర్సులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా రంగంలో AI, డేటా సైన్స్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని విద్యా నిపుణులు భావిస్తున్నారు.
విలేకరుల సమావేశంలో ఎకనమిక్స్, సైకాలజీ విభాగాల అధిపతులు డాక్టర్ ఉబైద్ ముస్తాక్, డాక్టర్ ఆయేషాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో ఈశ్వరీ స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ డీన్ డాక్టర్ విష్ణుపథ్, డాక్టర్ సృజన లు పాల్గొన్నారు.

