
SVIMS | ఎన్ఆర్ఐ వైద్య విద్యార్థులపై టీటీడీ ఔదార్యం...
ట్యూషన్ ఫీజు రూ. రెండు లక్షలు తగ్గింపు.
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) నిర్వహిస్తున్న శ్రీపద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో ఎన్‌ఆర్‌ఐ (NRI) విద్యార్థులపై టీటీడీ ఔదార్యం ప్రకటించింది. 4.5 సంవత్సరాలకూ వైద్య విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయాలని శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కోర్సు వ్యవధికి అనుగుణంగా ఫీజులను సర్దుబాటు చేయాలని కూడా నిర్ణయించారు.
శ్రీ పద్మావతీ మహిళా వైద్య కాలేజీలో 2020-21 బ్యాచ్ ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇటీవల టిటిడి ఈఓను కలిశారు.
"మా కోర్సు వ్యవధి 4.5 సంవత్సరాలు మాత్రమే. ట్యూషన్ ఫీజు ఐదేళ్లకు వసూలు చేస్తున్నారు" అని టిటిడి ఈఓ ఎం.రవిచంద్రకు వినతిపత్రం సమర్పించారు.
పేదలకు వైద్యం..
పేద ప్రజలకు తక్కువ ఫీజులతో కార్పొరేట్ వైద్య సేవలు అందించే లక్ష్యం టీటీడీ తిరుపతిలో స్విమ్స్ ఆస్పత్రి నిర్వహిస్తోంది. ఈ ఆస్పత్రిలోనే `1993లో శ్రీపద్మావతీ మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఉన్న ఈ కాలేజీ రాయలసీమ ప్రాంతంలో మహిళా వైద్య విద్యకు అత్యున్నత కేంద్రంగా ఉంది. 175 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్న ఈ మెడికల్ కాలేజీలో లోకల్ (SVU ప్రాంతం) అత్యధిక శాతం సీట్లు స్థానిక విద్యార్థినులకు కేటాయిస్తున్నారు.
తిరుపతి శ్రీపద్మావతీ మహిళా వైద్య కళాశాలలో ఎన్ఆర్ఐ ((NRI) కోటా కింద ప్రతి సంవత్సరం 3 నుంచి 25 సీట్లు విద్యార్థినులకు కేటాయిస్తారు. ఈ సీటు కోసం ఒకో విద్యార్థి నుంచి 25 లక్షలు ఫీజుగా నిర్ణయించారు.
గవర్నమెంట్ కోటా (A) ఏడాదికి రూ. 15,000 నుంచి రూ. 20,000 లోపు ఫీజులు వసూలు చేస్తున్నారు. మేనేజ్మెంట్ కోటాలో ఏడాదికి రూ. రూ. 12 లక్షలు నుంచి రూ. 15 లక్షల వరకు ఫీజుగా నిర్ణయించారు. ఎన్ఆర్ ఐ కోటాలో ఇచ్చే సీట్లకు 20 లక్షల వరకు ఉంది. అందులో ఐదేళ్ల స్థానంలో 4.5 సంవత్సరాలకే ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించడం ద్వారా ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండటంతో విద్యార్థినులకు అత్యుత్తమ ప్రాక్టికల్ ట్రైనింగ్ అందుబాటులో ఉంది.
ఫీజులో రాయితీ
నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనల ప్రకారం కోర్సు కాలపరిమితి 4.5 సంవత్సరాలు మాత్రమే. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈఓ ఎం.రవిచంద్ర స్పష్టం చేశారు. ఆరు నెలల ఫీజు ర్యాటిఫికేషన్ చేయాలని స్విమ్స్ ఆస్పత్రి గవర్నింగ్ బాడీకి సిఫారసు చేస్తేూ, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనివల్ల 2020-21 బ్యాచ్‌కు చెందిన NRI విద్యార్థులకు మరియు రాబోయే బ్యాచ్‌లకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది.
ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో చర్చించి, ఆమోదం (రాటిఫికేషన్) పొందేందుకు చర్యలు తీసుకోనున్నారు.
Next Story

