Courtesy AI
x

కడప- చెన్నై మార్గంలో ప్రయాణించాలా.. ఈ సమాచారం మీ కోసమే..

మంగంపేట వద్ద ఉపాధి హామీ పథకం ప్రారంభం నేపధ్యంలో జూలై రెండో తేదీ ట్రాఫిక్ మళ్లింపు.


కడప- చెన్నై జాతీయ రహదారిలో ప్రయాణిస్తున్నారా? అయితే ఓ క్షణం ఆగండి. జూలై రెండో తేదీ ట్రాఫిక్ మళ్లించనున్నారు. కడప నుంచి రాజంపేట, చెన్నై మార్గంలో రేణిగుంట నుంచి రైల్వే కోడూరు మీదుగా వచ్చే వాహనాలు దారి మళ్లిస్తున్న తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రకటించింది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అని ప్రకటించినా, సాయంత్రం వరకు ఆంక్షలు అమలులో ఉండే అవకాశం లేకపోలేదు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం ఈ విషయం తెలియజేసింది.

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లెలో విబీ జీరాంజీ (ఉపాధి హామీ పథకం) ప్రారంభానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. మంగంపేటలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు. మంగంపేట కడప- చెన్నై జాతీయ రహదారిపైనే ఉండడం వల్ల ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు.
"ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరిస్తున్నాం" అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు స్పష్టం చేశారు.
జూలై రెండో తేదీ నుంచి

ట్రాఫిక్ డైవర్షన్ ఇలా..

1. తిరుపతి నుంచి కడప వైపు వెళ్లే వాహనాలు
- రైల్వే కోడూరు సర్కిల్ నుంచి చిట్వేలి, బెస్తపల్లి మీదుగా రాజంపేట NTR సర్కిల్ నుంచి కడపకు వెళ్లాలి.
2. కడప నుంచి తిరుపతి వైపు వచ్చే వాహనాలు
- రాజంపేట NTR సర్కిల్, బెస్తపల్లి, చిట్వేలి, రైల్వే కోడూరు మీదుగా తిరుపతికి ప్రయాణించాలి.
3. పుల్లంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు
- ఓబులవారిపల్లి క్రాస్, చిన్న ఓరంపాడు, వై. కోట (ఎర్రగుంట కోట) మార్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవలసి ఉంటుంది.
కడప- చెన్నై జాతీయ రహదారిలో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు వల్ల సాధారణ ప్రయాణికులు, ప్రధానంగా తిరుమలకు వెళ్లే శ్రీవారి యాత్రికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తిరుపతి జిల్లా పోలీస్ సీనియర్ అధికారులు స్పష్టం చేశారు. జూలై రెండో తేదీ మాత్రమే ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని కూడా అధికారులు స్పష్టం చేశారు.
Read More
Next Story