తిరుపతి: గోవిందుడు శయన స్థితిలో ఎందుకు కనిపిస్తారు..?
x

తిరుపతి: గోవిందుడు 'శయన స్థితి'లో ఎందుకు కనిపిస్తారు..?

మే 23వ తేదీ నుంచి శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.


తిరుపతి శ్రీగోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మెత్సవాలు మే నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు 31వ తేదీతో ముగుస్తాయి. ఈ ఆలయంలో మూలమూర్తి విగ్రహం మిగతా ఆలయాలకు భిన్నంగా ఉంటుంది. మూలవిరాట్టు శేషతల్పంపై శయనించిన (యోగ నిద్రలో ఉన్న) భంగిమలో కనిపిస్తారు. ఆదిశేషుడిపై శయనించిన (తలకింద చేయి పెట్టుకుని యోగ నిద్ర) భంగిమలో శ్రీగోవిందరాజస్వామి దర్శనం ఇస్తారు. శయనస్థితిలో కనిపించడం వెనుక కూడా చారిత్రక నేపథ్య కథనం ఉంది.

"స్వయాన తమ్ముడైన తిరుమల శ్రీవారికి కుబేరుడు అప్పుగా ధనం ఇచ్చారంట. ఆ ధనాన్ని కొలిచి, కొలిచి అలసిపోయిన గోవిందుడు తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు" అనే కథనం వినిపిస్తుంది.

22న అంకురార్పణ

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలకు మే 22న అంకురార్పణ జరుగుతుందని టీటీడీ ప్రకటించింది. 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు, 23వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి.
మే 27న గరుడవాహనం, మే 30న రథోత్సవం నిర్వహిస్తారు.
మే 31న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

మే నెలో విశేష ఉత్సవాలు


ఆగమశాస్త్రం ప్రకారం తిథి, నక్షత్రాలను పరిగణలోకి తీసుకునే వేదపండితులు ప్రతి నెలా విశేష ఉత్సవాలను నిర్ణయిస్తారు. అందులో భాగంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే నెలలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు.
మే 1న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం జరుగుతుంది.
మే 8, 15 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు.
మే 9న శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
మే 12న హనుమజ్జయంతి
మే 18న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతారు. అదే రోజు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.
మే 21 నుంచి 30వ తేదీ వరకు నమ్మాళ్వార్ ఉత్సవాలు జరుగుతాయి.
Read More
Next Story