
"నాన్న, చంపొద్దు, మేము బతుకుతాం నాన్న"
తిరుపతి జిల్లా నారాయణవనంలో భార్య తల్లి హత్య. పిల్లలతో తండ్రి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితి ఏమిటి?
ఆ కుటుంబంలో కలతలు లేవు. అప్పులు లేవు.ఎందుకుని భార్య, తల్లిని చంపి, కొడుకు కూతురుతో కలిసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సాధారణ జనమే కాదు. కుటుంబీకులను కలిచి వేస్తున్న ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. మధ్యాహ్నం భోజనం తెస్తానని ఇంటికి వెళ్లిన బావ ఎంతకీ రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏమైందబ్బా అని ఇంటి వద్దకు వెళ్లిన బామర్ధి అక్కడ కనిపించిన దృశ్యాలతో నోటిమాట రాలేదు. కన్నీటి ధారలు ప్రవహించాయి.
తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం నారాయణపురం మండలం వెంకటకృఫ్ణపాలెం పంచాయతీ చాకలివీధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించిన విషాద సంఘటన వెనుక ఏమి జరిగింది?
"నాన్న చనిపోవద్దు. మమ్మల్ని బతకనివ్వు" అని వేడుకుంటూన్నా తండ్రి చలించలేదు. మృత్యువులా దూసుకు వచ్చిన రైలు కింద కొడుకు, కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పినడిన విషాద సంఘటన పోలీసులను కూడా కదిలించింది.
"తల్లి భార్యను చంపేసి, కొడుకు కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకున్న మోహన్ మానసిక స్థితి చలించినట్లు కనిపిస్తోంది" అని పుత్తూరు డిఎస్పి జి రవికుమార్ అభిప్రాయపడ్డారు. అప్పుల వల్ల ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రవికుమార్ చెప్పారు.
నారాయణవనం మండలం చాకలి వీధిలో మోహన్ భార్య హరిత, తల్లి చంద్రకళ, కొడుకు కౌశిక్, కూతురు హరిణితో నివాసం ఉంటున్నారు. మోహన్ కొడుకు కూతురు నారాయణ వనంకు సమీపంలో ఉన్న పుత్తూరు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి ఏడవ తరగతి చదువుతున్నారు. మోహన్ నారాయణ వనంలో సిమెంట్ దుకాణం నిర్వహిస్తున్నారు. అవసరాల కోసం ఆయన భార్య హరిత టైలరింగ్ షాప్ నిర్వహిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. హరిత తమ్ముడు బాలకృష్ణ కొన్ని రోజులుగా వారితోనే కలిసి ఉంటున్నారు. సిమెంట్ దుకాణం నిర్వహణలో చేదోడువాదోడుగా నిలిచాడు.
సంఘటన ఇదీ..
తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం నారాయణపురం మండలం వెంకటకృఫ్ణపాలెం పంచాయతీ చాకలివీధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. భార్య హరిత ( 33), తల్లి చంద్రకళ (65) ఇంట్లోనే హత్య చేశాడని పోలీసుల సందేహిస్తున్నారు. పుత్తూరులోని ఓ ప్రైవేటు బడిలో ఉన్న (14), కూతురు హరిణి (12)ని టీచర్లకు చెప్పి వెంట తీసుకుని వెళ్లాడు. బుధవారం రాత్రి పుత్తూరు మండలం వేపగుంట రైల్వే స్టేషన్ సమీపంలో బైక్ ఆపి, పట్టాలపైకి వెళ్లారు. కొడుకు కూతురు వారిస్తున్న మోహన్ ఏ మాత్రం చలించలేదు. తీవ్రంగా కొడుకు కౌశిక్ కుమార్తె హరిణి తండ్రిని పక్కకు లాగే ప్రయత్నం చేసే సమయంలోనే ఎగ్మోర్ నుంచి కాచిగూడకు బయలుదేరిన సూపర్ ఫాస్ట్ రైలు దూసుకు రావడంతో ఆ ముగ్గురు రైలు పట్టాలపై. సంఘటన జరిగిన కొద్ది సేపట్లోనే ఆ రైలు స్టేషన్ మాస్టర్ కు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటనతో.. హరిత, చంద్రకళ హత్య మిస్టరీ వీడడంతో పాటు కొడుకు కూతురుతో కలిసి అదృశ్యమైన పోలీసులకు తెలిసింది.
అన్నం తేవడం ఆలస్యం..
నారాయణగుణంలోని సిమెంట్ షాప్ లో ఉన్న బావ మోహన్ తీసుకువచ్చే క్యారియర్ కోసం నిరీక్షిస్తున్నాడు. మధ్యాహ్నం తర్వాత కూడా ఇంతకీ రాకపోవడంతో బావ మోహన్ కు బాలకృష్ణ ఫోన్ చేశాడు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఎంతకీ సమాధానం లేకపోవడంతో బావ ఇంటి వద్దకు చేరుకున్నాడు.
అక్క హరిత, చంద్రకళ శివాలయం పడి ఉండడం చూసి నిర్గాంతపోయాడు. వారిద్దరి మెడకు చున్నీ బిగించి హత్య చేసినట్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి, ఫిర్యాదు చేశాడు.
ఫోన్ స్విచాఫ్ చేసిన మోహన్ తన కొడుకు కౌశిక్, కూతురు హరిణి చదువుతున్న ప్రైవేటు పాఠశాల వద్దకు చేరుకున్నాడు. పిల్లలు ఇద్దరినీ బైక్ పై ఎక్కించుకొని ఎటో తీసుకొని వెళ్ళిపోయాడు.
గాలింపు..
బావ ఆచూకీ కోసం బాలకృష్ణ, తో పాటు పోలీసులు కూడా మోహన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వెంటనే పాఠశాల వద్దకు చేరుకుని పిల్లల కోసం వాకప్ చేశాడు. అక్కడ టీచర్లు చెప్పిన మాట విన్న బాలకృష్ణ దిమ్మెర పోయాడు.
" మామ బాలకృష్ణ చనిపోయాడు. అందుకే పిల్లలను తీసుకుని వెళుతున్నా" అని మోహన్ సమాచారం తెలుసుకున్న బాలకృష్ణ షాక్కు గురయ్యాడు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు మరింత అప్రమత్తమై మోహన్ వాడుతున్న సెల్ఫోన్ ట్రాక్ చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విఫల యత్నం చేశారు.
ఊహించని సంఘటన
ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న కొడుకు, కూతురుని బైక్లో వెంట తీసుకుని వెళ్లిన తండ్రి మోహన్ 7 గంటల ప్రాంతంలో పుత్తూరు మండలంలోని వేపగుంట రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్నాడు. నేరుగా పిల్లలతో కలిసి రైలు పట్టాల పైకి వెళ్ళాడు. సందేహించిన పిల్లలు తండ్రి మోహన్ ను వేడుకుంటున్న కనికరించలేదని తెలిసింది. చెన్నై నగరం ఎగ్మోర్ నుంచి బయలుదేరిన చెన్నై నగరం ఎగ్మోర్ నుంచి బయలుదేరిన కాచిగూడ కు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు మృత్యువుల దూసుకుని వస్తోంది. పక్కకు నెట్టడం పిల్లల వల్ల సాధ్యం కాలేదు. అదే సమయంలో 100 కిలోమీటర్లకు పైగానే వేగంతో వస్తున్న రైలు ఢీకొనడంతో మోహన్ ఆయన కొడుకు కౌశిక్, హరిణి శరీరాలు ఛిద్రమై ప్రాణాలు వదిలారు. ఈ విషయం తెలియని స్థితిలో అప్పటివరకు బావ పిల్లల కోసం బాలకృష్ణ, వారు ఆచూకీ తెలుసుకునేందుకు సాంకేతిక జ్ఞానంతో పోలీసులు ముమ్మరంగా గాలిస్తూనే ఉన్నారు.
వేగంగా ప్రయాణిస్తున్న రైలు కిందపడి ముగ్గురు మరణించిన కళ్ళారా చూసిన లోకో పైలట్ కదిలిపోయారు.
"అత్యవసరంగా బ్రేకులు వేయడానికి సాధ్యం కాదు. అలా చేస్తే రైలులోని ప్రయాణికులకు ప్రమాదం. మరో గత్యంతరం లేని స్థితిలో రైలు ముందుకి దూసుకుని పోవడం వల్ల ముగ్గురు చనిపోయారు" అని లోకో పైలట్ పుత్తూరు స్టేషన్ మాస్టర్ కు సమాచారం ఇచ్చారు.
ఆగిన గాలింపు..
పుత్తూరు రైల్వే స్టేషన్ కు సమీపంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అని జిఆర్పి పోలీసుల ద్వారా సమాచారం పుత్తూరు సివిల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటన పుత్తూరు ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది.
ఒద్దికగా ఉన్నారు.
నారాయణవనం మండలం వెంకటకృష్ణ పాలెం పంచాయితీ చాకలి వీధిలో నివాసం ఉంటున్న మోహన్ కుటుంబంలో కలతలు లేవు. వారి ఇంట్లో ఎప్పుడూ సరదాగానే ఉండే వారిని స్థానికులు చెబుతున్నారు.
" ఆరోగ్యం బాగా లేకుంటే చికిత్స కూడా చేయించింది" చెప్పారని డిఎస్పి రవికుమార్ తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జి. రవీంద్ర కూడా అనేక విషయాలపై సమాచారం సేకరిస్తున్నారని డిఎస్పి రవికుమార్ వివరించారు.
" మోహన్ మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది. వివరాలు సేకరిస్తున్నాం" అని కూడా డి.ఎస్.పి రవికుమార్ చెప్పారు.
నారాయణ గూడెం మండలంలో మోహన్ కు అప్పులు కూడా లేవని చెబుతున్నారు. వారి బంధువుల నుంచి కూడా ఇదే మాట వినిపిస్తోంది. తన సోదరికి ఇవ్వాల్సిన నగదును కూడా ఒక వ్యక్తి ద్వారా పోలీసులు గుర్తించారు.
" ఐదుగురు కుటుంబ సభ్యుల మరణానికి కారణమై ఆత్మహత్యకు పాల్పడిన మోహన్ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నాం దీని ద్వారా కొంత చిక్కుముడి వీడే అవకాశం ఉంది" అని డిఎస్పి రవికుమార్ అభిప్రాయపడ్డారు.
Next Story

