
అధిాకారులను సత్కరిస్తున్న తిరుపతి జిల్లా రవాణా శాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్
రవాణా సేవలో 'తిరుపతి' జిల్లాకు రాష్ట్ర ర్యాంకులు
పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పురోగతిలో విశిష్ట ఫలితాలు సాధించిన పుత్తూరు, శ్రీకాళహస్తి రవాణాశాఖ కార్యాలయాలు..
ప్రజలకు నాణ్యమైన, పారదర్శకంగా జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించడంలో తిరుపతి జిల్లా రవాణాశాఖ ప్రథమ స్థానంలో నిలిచాయి.
"జిల్లాలోని పుత్తూరు, శ్రీకాళహస్తి ఎంవీలు రాష్ట్ర స్థాయిలో వరుసగా రెండు సార్లు అవార్డులు సాధించారు" అని తిరుపతి జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు.
ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలను అంచనా వేయడానికి Interactive Voice Response System (IVRS ) ఫీడ్‌బ్యాక్ ప్రభుత్వం తీసుకుంటోంది. ఇందులో పుత్తూరు మోటారు వాహన తనిఖీ అధికారి చంద్ర శేఖర్ గత రెండు నెలలుగా వరుసగా 100 శాతం పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ (P3) నమోదు చేశారు. రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు ప్రథమ స్థానంలో నిలిచారు. శ్రీకాళహస్తి మోటారు వాహన తనిఖీ అధికారి దామోదర నాయుడు 96 శాతం పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ నమోదు చేశారు. ఈయనకు రాష్ట్రంలో ద్వితీయ స్థానం దక్కిది" అని మురళీమోహన్ వివరించారు.
ప్రజలకు సత్వర, పారదర్శకంగా, మర్యాదపూర్వక సేవలు అందించడం తోపాటు, సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్లే ప్రజాదరణ లభించిందని ఆయన అభిప్రాపడ్డారు. పుత్తూరు ఎంవీఐ చంద్రశేఖర్, శ్రీకాళహస్తి, ఎంవీఐ దామోదర్ నాయుడు, సిబ్బందిని జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మెమంటోతో సత్కరించారు.
Next Story

