x

Tirumala: రోజుకు 80 వేల మందికి దర్శనమే లక్ష్యం..

తమిళమాసంలో శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్న యాత్రికులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.


తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

అక్టోబర్ 1, 5 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరటాసి మాసం, అలాగే రాబోయే వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ (గురువారం), అక్టోబర్ ఐదో తేదీ (సోమవారం) ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగింది.
ప్రస్తుతం రోజుకు సుమారు 80 వేలమంది భక్తులకు స్వామివారి దర్శనం చేయించడం జరుగుతోంది. అయినప్పటికీ అదే రోజు అదనంగా వచ్చి దర్శనానికి నిరీక్షించే దాదాపు 30 వేల మంది భక్తులు తర్వాత రోజు స్వామివారిని దర్శించుకునే పరిస్థితి ఏర్పడుతోంది.
"సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సమయం మరింత పెరుగుతోంది. ఈ కారణంగా అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ ముద్దాడి రవిచంద్ర వెల్లడించారు.

సిఫారసు లేఖలకు బ్రేక్

బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన తేదీల ముందు రోజు సిఫారసు లేఖలు స్వీకరించారు. అంటే, సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం, అక్టోబర్ 4వ తేదీ ఆదివారం సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్యచౌదరి స్పష్టం చేశారు.


Read More
Next Story