కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగుల వర్షం
x

కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగుల వర్షం

48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం


బీహార్ నుంచి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి (ట్రఫ్) కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఎప్‌డీఎంఎ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ వ్యవస్థల ప్రభావంతో కోస్తాంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. గంటకు 30-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయన్నారు.

హెచ్చరికలు

ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం తీసుకోవాలి.

పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దు.

రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉరుములతో వర్షం పడేటప్పుడు చెట్ల క్రిందకు వెళ్లకూడదు (రైతులు, పశుకాపరులు ప్రత్యేక జాగ్రత్త).

వాతావరణం అనూహ్యంగా మారవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.

Read More
Next Story