తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద భారత ఉపరాష్త్రపతి రాధాకృష్ణన్
x
తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద భారత ఉపరాష్త్రపతి రాధాకృష్ణన్

శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి

ఇస్తికఫాల్ స్వాగతం పలికిన టీటీడీ పండితులు, అధికారులు


భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఆయన సోెమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేశారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వచ్చిన ఆయన క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించారు.

తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం వచ్చారు. ఆలయ మహద్వారం వద్ద ఆయనకు టీటీడీ వేదపండితులు, ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ ముద్దాడి రవిచంద్ర ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.


అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.


అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. భారత ఉపరాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ రవిచంద్ర భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందించారు.


శ్రీబేడీ ఆంజనేయ దర్శనం

శ్రీవారి దర్శనం తరువాత భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ వేదపండితులు, టీటీడీ అధికారులతో కలిసి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీబేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. సాధారణ యాత్రికుడి మాదిరే అఖిలాండం వద్దకు చేరుకుని, కర్పూరం వెలగించిన ఆయన కొబ్బరికాయకొట్టి మొక్కు చెల్లించారు.

ఆయన వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్లాల్ , జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి బోర్డు సభ్యులు రామమూర్తి, భానుప్రకాష్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి, రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

క్షేత్ర ఆచారం..

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రకులు మొదట భూ వరాహక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. ఆ తరువాత శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడం ఆచారం. భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా మంగళవారం ఉదయం మొదటి అతిథి గృహం నుంచి శ్రీవారి పుష్కరిణికి సమీపంలోని వరాహస్వామి క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ మొదట మొక్కులు చెల్లించిన రాథాకృష్ణన్ తరువాత శ్రీవారిని దర్శించుకున్నారు.

Read More
Next Story