చీకటిలో విరిసిన చిరునవ్వులు.. రాత్రికి రాత్రే  వెలుగు...
x
శ్రీకాళహస్తి సమీపంలోని పిల్లమేడు గిరిజస కాలనీ

చీకటిలో విరిసిన చిరునవ్వులు.. రాత్రికి రాత్రే వెలుగు...

శ్రీకాళహస్తి వద్ద గిరిజన కాలనీలో ఏమి జరిగింది? వీడియో స్టోరీ


కళ్లముందే ఎన్నో కాలనీలు చీకట్లో మగ్గుతున్నాయి. అందులో గిరిజన కాలనీలను పట్టించుకునే వారు తక్కువ. శ్రీకాళహస్తి నియోజకవర్గం తోట్టంబేడు మండలం పిల్లమేడు గిరిజన కాలనీలో పరిస్థితి కూడా అలాందిదే. రాత్రిళ్లు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. పాముల భయంతో కాలనీ వాసులు అల్లాడిపోయారు. అసాధ్యం అనుకున్న ఆ మార్పు ఒక్క రోజులోనే సాధ్యమైంది. కొందరు యువకుల ప్రయత్నం వల్ల ఎలా సాధ్యమైందంటే..

దశాబ్దాలుగా చీకట్లో

శ్రీకాళహస్తి నియోజవర్గంలోని పిల్లమేడు పంచాయతీలో 35 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. వారిలో కొందరికి ఇంటి పట్టాలు ఉన్నా, పక్కా ఇళ్లు లేవు. కాలనీలో విద్యుత్ స్తంభాలు దిష్టిబొమ్మల్లా మారాయి. ఏడు స్తంభాలు ఉంటే, ఒక లైటు మాత్రమే మినుకుమినుకు మనేది. ఈ పరిస్థితుల్లో
పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి సోదరులు సుమారు 50 మంది తమ మిత్రులతో జట్టుగా గిరిజన కాలనీలను సందర్శించడం ప్రారంభించారు. పేట చిరంజీవి ఏమంటారంటే..
"అన్నీ ఉన్న వారికి ఇబ్బంది లేదు. నిర్లక్ష్యానికి గురవుతున్న వారిని పలకరించాలని అనుకున్నాం. గిరిజనులు చాలా అమాయకులు అందుకే ఆ కాలనీలను ఎంచుకున్నాం" అని పేట చిరంజీవి చెప్పారు. కాలనీలో సందర్శనలో ఉన్న మా బృందానికి పిల్లమేడు గిరిజనుల సమస్యలు తెలుసుకుకోవాలని అనుకుని వెళ్లామని ఆయన చెప్పారు. అక్కడి సమస్య చూశాక చాలా బాధ వేసింది. మేము చేసిన ప్రయత్నానికి అధికారుల సహకారం లభించింది. దీంతో ఒక్క రాత్రిలోనే వీధిదీపాలు వెలగడానికి ఆస్కారం కలిగిందని ఆయన వివరించారు.
(ఇంతకీ ఈ యువకులు చేసిన ప్రయత్నం ఏమిటో ఈ వీడియోలో చూడండి)


Read More
Next Story