విశాఖ తీరంలో రష్యా యుద్ధ నౌకల కలకలం
x
విశాఖ తీరంలో యుద్ధనౌకలు

విశాఖ తీరంలో రష్యా యుద్ధ నౌకల కలకలం

అంతర్జాతీయ చర్చకు దారితీసిన అకస్మాత్తు రాక.


పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, సముద్ర జలాల్లో అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో విశాఖ తీరానికి రష్యా యుద్ధ నౌకలు చేరుకోవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా నౌకాదళానికి చెందిన అత్యాధునిక ’స్టెరెగుష్చి క్లాస్ కార్వెట్స్‘ (Steregushchiy-class corvettes) రకానికి చెందిన షోవర్‌షెన్నీ, రెజ్కీ అనే రెండు యుద్ధ నౌకలు రెండు రోజుల కిందట విశాఖ తీరానికి చేరుకున్నాయి.

అనధికారిక పర్యటన .. అధికారిక స్వాగతం
ఈ నౌకలు అనధికారిక విజిట్ పేరుతో విశాఖకు వచ్చినట్లు తెలుస్తోంది. తీరానికి చేరుకున్న రష్యా నౌకాదళ సిబ్బందికి భారత నౌకాదళ (Indian Navy) అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, శక్తివంతమైన రష్యా యుద్ధ నౌకలు భారత తీరంలో ప్రత్యక్షం కావడం రక్షణ రంగ నిపుణులను ఆకర్షిస్తోంది.
గోప్యంగా రాక వెనుక ఆంతర్యం?
అయితే, రష్యాకు చెందిన ఈ యుద్ధ నౌకల రాక వెనుక ఉన్న అసలు కారణాన్ని ఇండియన్ నేవీ ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. ఇవి కేవలం సాధారణ విరామం కోసం వచ్చాయా? లేక భారత్-రష్యా నౌకాదళాల మధ్య ఏవైనా ద్వైపాక్షిక విన్యాసాలు (Bilateral Exercises) నిర్వహించే అవకాశం ఉందా? అనే అంశాలపై సందిగ్ధత నెలకొంది. దీనిపై త్వరలోనే నౌకాదళం నుంచి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Read More
Next Story