షా సభకు రావాలంటూ ఆందోళన.. పార్లమెంట్‌లో ప్రతిష్ఠంభన
x

షా సభకు రావాలంటూ ఆందోళన.. పార్లమెంట్‌లో ప్రతిష్ఠంభన

నిరసనకారులపై జూలై 20వ తేదీన పోలీసుల చర్యపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో మాట్లాడాలని ప్రతిపక్షాల డిమాండ్..


Click the Play button to hear this message in audio format

న్యూఢిల్లీలో జూలై 20న నిరసనకారులపై పోలీసుల చర్యకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో శుక్రవారం పార్లమెంట్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య లోక్‌సభ, రాజ్యసభలు ప్రారంభమైన రెండు గంటలలోపే వాయిదా పడ్డాయి.

షా సమాధానం కోసం ప్రతిపక్షం డిమాండ్..

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ అప్పటి కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జీ, పెల్లెట్ గన్‌ల వాడకంపై కేంద్రం హోం మంత్రి అమిత్ షా స్వయంగా సభలో వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయితే నిరసనల మధ్య కూడా లోక్‌సభలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు–2026ను చర్చ లేకుండానే ఆమోదించారు.

రాజ్యసభలో ఖర్గే–రిజిజు మధ్య వాగ్వాదం..

అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కోరారు. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ మంత్రి ఎప్పుడు సభకు రావాలనేది ప్రతిపక్షం నిర్ణయించే హక్కు లేదని స్పష్టం చేశారు.

అమిత్ షా రోజూ పార్లమెంట్ ప్రాంగణంలోనే ఉంటారని, అవసరమైన సమయంలో మంత్రి సమాధానం ఇస్తారని రిజిజు తెలిపారు. ప్రతిపక్షం సభను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించిన రిజిజు, నినాదాలు చేసి సభకు అంతరాయం కలిగించడం సరైన పద్ధతి కాదన్నారు. హోం మంత్రి సమాధానం చెప్పే సమయంలో ప్రతిపక్ష సభ్యులు సభలో ఉండకుండా బయటకు వెళ్లిపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల అభిప్రాయాన్ని అమిత్ షాకు తెలియజేయాలని రిజిజును గురువారం ఛైర్మన్ రాధాకృష్ణన్ కోరినట్లు సమాచారం.

ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఈ అంశంపై విభేదాలు కొనసాగుతుండటంతో వర్షాకాల సమావేశాల్లో మరోసారి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. జూలై 20 ఘటనపై హోం మంత్రి ప్రకటన ఇవ్వాలన్న డిమాండ్‌పై ఇరు పక్షాలు తమ తమ వైఖరిని మార్చకపోవడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.

Read More
Next Story