బ్యూటీషియన్ తో ప్రేమాయణం నడిపిన ఈ ఎస్సై ఎవరు?
x

బ్యూటీషియన్ తో ప్రేమాయణం నడిపిన ఈ ఎస్సై ఎవరు?

ఖాకీల 'పంచాయితీ': విజయనగరంలో హాట్ టాపిక్!


విజయనగరం జిల్లాలో ఒక ఇన్‌స్పెక్టర్ స్థాయి పోలీసు అధికారి ప్రేమ పేరిట ఓ బ్యూటిషియన్ ను మోసగించినట్టు కేసు నమోదైంది. బ్యూటీ పార్లర్ నిర్వహించే మహిళ ఈమేరకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ వివాదంపోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.

గంట్యాడకు చెందిన ఓ మహిళ విజయనగరంలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. గతంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన పోలీసు అధికారికి, ఈమెకు మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, ఆ అధికారి ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశారని సమాచారం.
బదిలీతో మొదలైన దుమారం
ఆ అధికారికి వేరే ప్రాంతానికి బదిలీ కావడంతో, ఆమెను పూర్తిగా దూరం పెట్టడం ప్రారంభించారు. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె కోరగా ఆ ఎస్సై నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం కాస్తా పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల (IG, SP) దృష్టికి వెళ్లింది.
డబ్బుతో సెటిల్‌మెంట్ ప్రయత్నాలు?
ఈ వివాదాన్ని బయట పడకుండా చూసేందుకు ఆ పోలీసు అధికారి బాధితురాలికి సుమారు నాలుగు లక్షల రూపాయలు ఆశ చూపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, తనకు డబ్బు వద్దని, తనను, తన బిడ్డను బాధ్యతగా చూసుకోవాలని ఆమె తెగేసి చెప్పినట్లు సమాచారం.
పోలీసుల స్పందన
ప్రస్తుత వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఆర్వీకే చౌదరి ఈ ఘటనపై స్పందించారు. తనకు రక్షణ కావాలంటూ సదరు మహిళ ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని ధృవీకరించారు. ఇప్పటికే ఈ ఘటనపై FIR నమోదైంది.
క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read More
Next Story