రాత్రికి రాత్రే పెట్రో ధరలు పెంచిన కేంద్రం, ఈసారి ఎంతంటే..
x

రాత్రికి రాత్రే పెట్రో ధరలు పెంచిన కేంద్రం, ఈసారి ఎంతంటే..

వాహనదారులకు మళ్లీ వాత: వారం వ్యవధిలో రెండోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!


దేశంలోని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు మరోసారి గట్టి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ఉధృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటరు పెట్రోల్, డీజిల్‌పై తాజాగా దాదాపు 90 పైసల వరకు పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. వారం రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. నాలుగు రోజుల క్రితమే లీటర్‌పై రూ. 3 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే.
ధరల పెంపునకు గల కారణాలు
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతలు, సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో ప్రభుత్వ చమురు సంస్థలపై ఆర్థిక భారం భారీగా పెరిగింది. దేశీయంగా ధరల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ.. అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా ఈ తాజా పెంపు తప్పలేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా ఇంధన ధరల పట్టిక ఇలా ఉంది. హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ₹111.88 రూపాయలు కాగా డీజిల్ లీటర్ ₹99.95, ఢిల్లీలో ₹98.64 (+0.87 పైసలు)₹91.58 (+0.91 పైసలు), ముంబైలో ₹107.59 (+0.91 పైసలు), ₹94.08 (+0.94 పైసలు)కోల్‌కతాలో ₹109.70 (+0.96 పైసలు), ₹96.07 (+0.94 పైసలు), చెన్నైలో లీటర్ పెట్రోల్ ₹104.49 (+0.82 పైసలు) కాగా డీజిల్ లీటర్ ₹96.11 (+0.86 పైసలు)గా ఉంది.
తాజా పెంపులో కోల్‌కతాలో పెట్రోల్‌పై అత్యధికంగా 96 పైసల పెంపు నమోదు కాగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్ ధర ఏకంగా రూ. 111.88 కి చేరింది. డీజిల్ ధర కూడా సెంచరీకి చేరువలో (రూ. 99.95) ఉండటంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడనుంది.
వారం తిరగకముందే వరుసగా ధరలు పెరుగుతుండటంతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More
Next Story