‘‘కేంద్ర విద్యా బడ్జెట్ కన్నా.. తల్లిదండ్రులే ఎక్కువ ఖర్చు’’
x
రాహుల్ గాంధీ

‘‘కేంద్ర విద్యా బడ్జెట్ కన్నా.. తల్లిదండ్రులే ఎక్కువ ఖర్చు’’

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ


ప్రభుత్వం విద్యపై ఖర్చుపై చేస్తున్న దాని కంటే తల్లిదండ్రులే ఎక్కువ మొత్తాన్ని భరిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పెరుగుతున్న విద్యా ఖర్చులే ఈ నిరసనలకు కారణమని అన్నారు. నీట్ కు సిద్దం కావడానికి కుటుంబాలు ఏటా సుమారు రూ. 1.32 లక్షలు ఖర్చు చేస్తున్నాయని, కానీ కేంద్ర వార్షిక బడ్జెట్ కేవలం రూ. 1.4 లక్షలు ఉందని చెప్పారు.

దేశ విద్యా వ్యవస్థ పూర్తిగా దారితప్పిందని గత పది సంవత్సరాలలో దాదాపు 152 పేపర్ లీక్ లు జరిగాయని దీనివల్ల 7.5 కోట్ల మంది ప్రభావితం అయ్యారని ఆరోపించారు. పెరుగుతున్న విద్యా వ్యయం, పెరుగుతున్న నిరుద్యోగం అనే మూడు కారణాల వల్లే యువతలో నిరాశ పెంచిందని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థుల ఉద్యమానికి తాను గట్టి అండగా నిలబడతానని చెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నిరసనకారులకు ప్రధానమంత్రి మోదీ క్షమాపణ చెప్పాలని, విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రధాని నివాసం ఎదుట నిరసన..

పార్లమెంట్ లో చర్చకు ప్రభుత్వం నిరాకరించినందునే తాను ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేసి విద్యార్థులకు అండగా నిలబడ్డానని అన్నారు. ప్రతిపక్షానికి సహజమైన వేదిక పార్లమెంటే అని, ప్రధానమంత్రి నివాసానికి పాదయాత్ర చేసే ముందు వర్షాకాల సమావేశాల్లో ఈ అంశంపై చర్చించేందుకు లోక్ సభ స్పీకర్ అనుమతి కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ప్రతిపక్షానికి మరోమార్గం లేదని చెప్పుకొచ్చారు.

పోలీసులు కూడా బాధపడుతున్నారు..

విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి పోలీసులు కూడా బాధపడుతున్నారని పరీక్షలలో జరిగిన అవకతవకలకు పాల్పడిన వారిని శిక్షించకుండా విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడంపై వారికి బాధించిందని అన్నారు. ఈ విషయాన్ని పోలీసులు తనకు చెప్పారని పేర్కొన్నారు.

విద్యార్థులు ఉగ్రవాదులు కాదు..

మోదీ ప్రభుత్వం దేశ విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం విద్యార్థులు డిమాండ్ చేయడం న్యాయమేనని పేర్కొన్నారు. నిరసన చేస్తున్న విద్యార్థులు ఉగ్రవాదులు కారని పేర్కొన్నారు. విద్యార్థులు నిష్పక్షపాతమైన విద్యా వ్యవస్థను కోరుతున్నారని అన్నారు. విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చేస్తున్న డిమాండ్ కు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.


Read More
Next Story