
శృంగారంలో విలేకరి నాలుకను కొరికేసిన మహిళ!
ఒంటిమిట్ట హరిత హోటల్‌లో వింత ఘటన, లబలబలాడుతూ ఆస్పత్రికి పరుగెత్తిన విలేఖరి
వినడానికి విడ్డూరంగా ఉన్నా.. నమ్మలేని నిజమిది. మితిమీరిన శృంగార వాంఛ ఒక విలేకరిని మాట్లాడలేని స్థితికి చేర్చింది. ఒంటిమిట్టలోని హరిత హోటల్ వేదికగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
అసలేం జరిగింది?
స్థానికుల కథనం ప్రకారం.. పుచ్చకాయల వ్యాపారం చేస్తూ ఒక దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న రవిబాబు, పుచ్చకాయలు రవాణా చేసే ఆటో యజమాని హరి కలిసి ఆదివారం సాయంత్రం ఒక మహిళను తీసుకుని హరిత హోటల్‌కు వెళ్లారు. తొలుత గది అద్దె తీసుకోకుండా లోపలికి వెళ్లడాన్ని హోటల్ సిబ్బంది అడ్డుకున్నప్పటికీ, విలేకరి తన పరపతిని ఉపయోగించి ముగ్గురూ కలిసి గదిలోకి వెళ్లారు.
అక్కడ ముగ్గురూ కలిసి మద్యం తాగారు. ఈ తర్వాత శృంగారానికి దిగారు. శృంగారంలో నిమగ్నమై ఉండగా, ఆ మహిళ విలేకరి రవిబాబు నాలుకను బలంగా కొరికేసింది. దీంతో ఆ గది రక్తమయమైంది. తీవ్ర నొప్పితో విలవిలలాడిన రవిబాబు వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా, పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు.
తప్పించుకునే ప్రయత్నమా?
ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇరుక్కుపోయిన ఆ మహిళ, వారి నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగానే అలా చేసిందా? లేక మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఈ పరిణామం చోటు చేసుకుందా? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఘటన తర్వాత ఆటో డ్రైవర్ హరి సదరు మహిళను రైల్వే స్టేషన్‌లో వదిలిపెట్టగా, ప్రస్తుతం ఆమె ఆచూకీ లభ్యం కావడం లేదు.
వివాదాలకు నిలయంగా 'హరిత'
పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హరిత హోటల్, ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో మట్టి తవ్వకాల విషయంలో ఇక్కడ దాడులు జరిగాయి. మద్యం మత్తులో ఘర్షణలు నిత్యకృత్యమయ్యాయి.
అధికారుల స్పందన
ఈ ఘటనపై డివిజనల్ మేనేజర్ మల్లికార్జున గౌడ్ స్పందించారు. ఇన్‌చార్జి మేనేజర్ రాజశేఖర్‌రెడ్డికి మెమో జారీ చేసినట్లు తెలిపారు. సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్నామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రస్తుతం పోలీసులు ఆటో డ్రైవర్ హరిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. పరారీలో ఉన్న మహిళ కోసం గాలింపు చేపట్టారు. ఏది ఏమైనా, ఒక విలేకరి ఇలాంటి వివాదంలో చిక్కుకుని నాలుక కోల్పోవడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Next Story

