
నేపాల్ విలవిల.. 903 మంది మృతి..4,247 మంది మిస్సింగ్
భోటేకోశి నది ఉధృతంగా ప్రవహించడంతో వరద దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి.
నేపాల్‌ను వరదలు వణికిస్తున్నాయి. మృతుల సంఖ్య 900 దాటింది. తాజా లెక్కల ప్రకారం ఇప్పటివరకు 903 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వేలాది మంది ఆచూకీ తెలియడం లేదు. గల్లంతైనవారి సంఖ్య 4,247గా ఉంది. అదే సమయంలో 10,451 మందిని సహాయక బృందాలు రక్షించాయి. అయితే.. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
మరోవైపు మృతదేహాలను గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. దీంతో భారత్ రంగంలోకి దిగింది. మృతులను గుర్తించేందుకు 19 మంది సభ్యులతో కూడిన భారత ఫోరెన్సిక్ బృందం కాఠ్మండుకు చేరుకుంది. డీఎన్ఏ నమూనాలను పరిశీలించి మృతుల వివరాలను నిర్ధారించడంలో ఈ బృందం సహాయం చేస్తోంది. ఇక ఈ విపత్తు ఎలా సంభవించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం.
Next Story

