రాష్ట్రాభివృద్ధికి జాతీయ మోడల్..
x

రాష్ట్రాభివృద్ధికి జాతీయ మోడల్..

తిరుపతిలో కీలక భేటీ. సీమలో స్పీడ్ పెంచిన సీఎం చంద్రబాబు.


రాయలసీమ జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పక్కా స్కెచ్ వేశారు. జూలై ఒకటో తేదీ నుంచి ఐదు రోజుల పాటు నాలుగు జిల్లాల్లో వరసు పర్యటనలకు రానున్నారు. ఇందులో కడప జిల్లా దీర్ఘకాలిక స్వప్నం సాకారం చేసే కడప ఉక్కు పరిశ్రమకు మళ్లీ టెంకాయ కొట్టడం ప్రధానమైంది.

తిరుపతి వేదికగా మరో కీలక సమావేశం కూడా నిర్వహించనున్నారు.
రాష్ర్ట ఆర్థికాభివృద్ధికి జాతీయ స్థాయి మోడల్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యే ఈ సమావేశానికి తిరుపతి వేదిక కానుంది. జూలై రెండో తేదీ ఓ ప్రయివేటు హోటల్ ఈ కీలక సమావేశం నిర్వహణకు కార్యక్రమం ఖరారైంది.
రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సుడిగాలి పర్యటన సాగనుంది. అభివృద్ధి, పరిశ్రమల శంకుస్థాపన చేసే ఆయన ఆ ప్రాంతంలోనే రాత్రిళ్లు కూడా బస చేయనున్నారు. ఈ మేరకు తిరుపతి, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

నాలుగు జిల్లాలు ఐదు రోజులు..

రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి ఆయన పర్యటన ప్రారంభం అవుతుంది. ఆ జిల్లాల్లో సంక్షేమ పథకాలు పంపిణీ చేయడంతో పాటు పరిశ్రమలకు శంకుస్థాపనలు చేయనున్నారు.
జూలై 1, నెల్లూరు జిల్లా : చిల్లకూరు మండలంలో ఆయన పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తారు.
సాయంత్రం

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ సమీపంలో ద్విచక్ర వాహనాల సంస్థ ర.750 కోట్లతో హీరో మోటో కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. రాత్రికి శ్రీసిటీలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బస చేస్తారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వేంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, అదనపు ఎస్పీ రవిమనోహరాచారి ఇక్కడ భద్రత ఏర్పాట్లు చేశారు.

జూలై 2వ తేదీ ఉదయం :
విబి జీ రాంజీ (VB G RAM G)గా పేరు మారిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ (ఎన్ఆర్ఈజీఎస్) పథకాన్ని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభిస్తారు.
సాయంత్రం కీలక భేటీ
తిరుపతిలో అదే రోజు సాయంత్రం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సంబంధించి కీలక సమావేశం జరగనున్నది. తిరుపతిలోని ఓప్రయివేటు హోటల్ లో gross state domestic product ( GSDP) రాష్ర్ట ఆర్థికాభివృద్ధికి జాతీయ స్థాయి మోడల్ వర్తింపచేసే విధానంపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యులతో పాటు ప్రధానమంత్రి ఎకనమిక్ కౌన్సిల్ సభ్యులు కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తిరుపతిలోనే బస చేస్తారు.
కడప సెంటిమెంట్ కు ఊపిరి

జూలై మూడో తేదీ ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని సున్నపురాళ్లపల్లె వద్దకు చేరుకుంటారు. రాయలసీమ ప్రాంతానికి ఊపిరిపోస్తుందనే ఆశలకు రెక్కలు కట్టడానికి, కడప జిల్లా ప్రజల సెంటిమెంట్ సాకారం చేసే కడప ఉక్కు కర్మాగారానికి ఆయన మళ్లీ శంకుస్థాపన చేయేున్నారు.

" 2028 నాటికి ఉత్పత్తి సాధించే లక్ష్యంగా అన్ని అనుమతులు ఇచ్చాం. కడప జిల్లా ప్రజల కల సాకారం చేస్తాం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

కుప్పంలో ముమ్మర పర్యటన

కడప జిల్లాలో కార్యక్రమాలు ముగించుచునే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్కడి నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పర్యటనకు వెళలారు.
జూలై మూడో తేదీ నుంచి ఐదోతేదీ వరకు ఆయన కుప్పంలో విస్తృతంగా పర్యటించి, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు, ప్రజలతో భేటీ అవుతారు. రెండు రోజుల పాటు ఆయన నియోజకవర్గం, ఉమ్మడి చిత్తూరు జిల్లాల నేతలతో కూడా పార్టీ కలాపాలపైసమీక్షించే అవకాశం ఉంది. ఐదో తేదీ ఆయన అమరావతికి తిరిగి వెళతారు. ఈ మేరకు అధికారులు కూడా చురుగ్గా ఏర్పాట్లు చేశారు.
Read More
Next Story