
జాతీయ రహదారి రక్తసిక్తం:ఇద్దరు పిల్లలు మృతి...
తిరుపతి-కడప జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.
జాతీయ రహదారిపై మళ్లీ రక్తసిక్తమైంది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మరణించారు. మొత్తం 30 మంది ప్రయాణికుల్లో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం వేకువజామున సుమారు రెండు గంటల సమయంలో కడప జిల్లా (ప్రస్తుతం తిరుపతి జిల్లా) పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లెకు సమీపంలో ఈ ఘోరప్రమాదం జరిగింది.
ఈ సంఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాదరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
తిరుపతి నుంచి కడపకు..
కడప డిపో సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు ఆదివారం అర్ధరాత్రి తిరుపతి నుంచి బయలుదేరింది. రాత్రి కావడంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. ఈ బస్సు పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లె సమీపంలో సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఆ శబ్దానికి ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అప్పటికే బస్సులు ఆర్తనాలు మిన్నంటాయి.

