కొద్ది సేపట్లో గూగుల్ డేటా సెంటర్ కు భూమి పూజ
x

కొద్ది సేపట్లో గూగుల్ డేటా సెంటర్ కు భూమి పూజ

డేటా సెంబర్ కు పర్యావరణ అనుమతులు మంజూరు


కాసేపట్లో విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తున్నారు.

విశాఖ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం భూ కేటాయింపులు జరిగాయి.

వాటిని ఏర్పాటు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యావరణ అనుమతులను ఆగమేఘాల మీద అందించింది.

తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 600 ఎకరాల కేటాయించారు.

15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు అవుతున్నది.

నిన్న రాత్రి గూగుల్ కంపెనీ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ విందునిచ్చారు.

నేడు విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు శంకుస్థాపన తర్వాతముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఉదయం 08:45 గంటలకు విశాఖ పోర్టు గెస్ట్ హౌస్ నుంచి తర్లువాడకు బయలుదేరనున్న సీఎం చంద్రబాబు.

మధ్యాహ్నం 02:40 గంటలకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం సందర్శించి అక్కడి అధికారులతో సమావేశం అవుతారు.


Read More
Next Story