రాయలసీమకు అడుగడుగనా ద్రోహం
x

'రాయలసీమకు అడుగడుగనా ద్రోహం'

"పూర్వపు 70 యేళ్ల కంటే గత పదేళ్లలోనే రాయలసీమకు ఎక్కువ అన్యాయం జరిగింది"


రాయలసీమ విద్యావంతుల వేదిక 5 వ రాష్ట్ర మహా సభలు ఈ రోజు కర్నూలు లోని సిల్వర్ జూబిలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియం లో జరిగాయి. వేదిక కో కన్వీనర్ భాస్కర రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సభల ప్రారంభ సమావేశంలో ప్రధాన వక్తగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ E. వెంకటేశు మాట్లాడుతూ శ్రీ బాగ్ ఒప్పందం మొదలు, శ్రీ కృష్ణ కమిటీ, శివ రామకృష్ణ కమిటి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయని, అయితే అధికారంలోకి వచ్చిన పాలకులు ఈ హామీలను ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఫలితంగా రాయలసీమ లో కరువులు, వలసలు, రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, దీన్ని రాయలసీమ ప్రజలు ప్రభుత్వాలను నిలదీయాలని, తమ హక్కుల కొరకై సమైక్య ఉద్యమాలను నిర్వహించాలని, పిలుపునిచ్చారు.

"అమరావతినే రాజధానిగా చేయాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు, శివరామ నివేదికను తోసిపుచ్చాడు. దానికి బదులుగా, ప్లానింగ్, అభివృద్ధి, నియంత్రణకై ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాంత చట్టం, 2014 (Andhra Pradesh Capital Repon Dedie _ment Area Act (APCRDA), 2014) తెచ్చాడు. తమాషా ఏమిటంటే, ఆ 170 పేజీల చట్టంలో అమరావతే రాజధాని అనే ఊసే లేదు. ఏమైతేనేం, కో ఆప్షన్, ఒత్తిడుల ద్వారా వేల ఎకరాలను రాజధాని నిర్మాణానికి సేకరణ జరిగింది," అని ఆయన అన్నారు.

2019లో టిడిపి ఓటమితో రాజధానిగా అమరావతి ఐదేళ్ళు కనుమరుగయ్యిందని చెబుతూ వైఎస్ ఆర్ పై ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి చట్టం, 2014 (CRDA) స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రికరణ మరియు అన్నిప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టాన్ని (Andhra Pradesh capital Decentralization and Incasive Develop- ment of All Regions Act, 2020) ప్రవేశపెట్టింది. రాష్ట్రానికి మూడు రాజధానుల 1) అమరావతి లెజిస్లేటివ్ 2) విశాఖపట్నం కార్యనిర్వాహక 3) కర్నూల్ న్యాయ రాజధానులుగా, ఆంధ్రప్రదేశ్ మహానగర మరియు పట్టణప్రాంతాల అభివృద్ధి అథారిటీ చట్టం (APMRUDAA) 2016ను ప్రకటించి అమలుచేయడంలో విఫలమయ్యారని ప్రొఫెసర్ వెంకటేశు అన్నారు.

సభకు హాజరయిన ప్రజలు

"అమరావతి ప్రాంత ప్రజల నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిరసన ఎదుర్కొన్నాు. ఆ ప్రాంత సంపన్న రైతులు టిడిపి దన్నుతో అమరావతే రాజధానిగా వుండాలని ఉద్యమాలు కొనసాగించారు. న్యాయవ్యవస్థ నుండి వ్యతిరేకతను ముందుగా పసిగట్టి జగన్ ప్రభుత్వం తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధిప్రాంత చట్టంను పునరుద్ధరించింది. 2022 మార్చితిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అమరావతిలో మాస్టర్ ప్లాన్ ను ఆరునెలల లోపు పూర్తి చేయమంది. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో, అమరావతిలో నిర్మాణ పనులు ముమ్మరము య్యాయి. అంతేగాక, ప్రజా రాజధాని అనే పేరుతో గ్లోబల్ రాజధానికి మరో నలభై వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక గ్లోబల్ రాజధానికి నిధుల సేకరణకై చంద్రబాబు అన్ని ప్రయత్నాలు- కేంద్రప్రభుత్వం, విదేశీ రుణాలు, ప్రజలనుండి స్వచ్ఛంద విరాళాల సేకరణ చేస్తున్నాడు. అయితే, నాయుడి విధానాలు, మాజీ టిడిపి మంత్రి శోభనాద్రి నాయుడుతో సహా అనేకులు వ్యతిరిస్తున్నారు, " అని ఆయన అన్నారు.

అనంతరం బొజ్జా దశరథ రామిరెడ్డి గారు మాట్లాడుతూ గత 70 సంవత్సరాల రాయలసీమకు జరిగిన అన్యాయం కంటే ఈ పదేళ్లలోనే, సొంత ప్రభుత్వాల చర్యల వల్ల నే రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ అన్యాయం జరిగిందని, రోజు రోజులు రాయలసీమ నీటి హక్కులను కోల్పోతువుందని, రాయలసీమ ప్రజా ప్రతిధులు ఎవ్వరూ రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రశ్నించడం లేదన్నారు.

రాయలసీమ ఉద్యమ కారులు సీమ ప్రజల ను చైతన్య వంతం చేయవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ నాటి సభ లో రాయలసీమ ప్రముఖులు నాగలక్ష్మి దేవి, K.V. సుబ్బారెడ్డి, చంద్ర శేఖర కల్కురా, డాక్టర్ శంకర శర్మ, ప్రొఫెసర్ మన్సూర్ రహమాన్, తూర్పాటి మనోహర్ గారలు మాట్లాడారు. ఈ సభలలో సుబ్బరాయుడు గారి సంస్మరణ రాయలసీమ పుస్తకం, పశ్చిమ ప్రాంతం రాజకీయ సామాజిక విశ్లేషణ పుస్తకం
" గవి గట్టు కథలు " అనే పుస్తకావిష్కరణ జరిగాయి.
అనంతరం " రాయలసీమ నిరుద్యోగం - ఉపాధి అవకాశాలు " అనే అంశంపై విద్యార్థుల స్పందనలు, చర్చలు జరిగాయి. విద్యార్థి సంఘాల నాయకులు భాస్కర్ , సీమ కృష్ణ, రాహుల్, వంశీ. మాట్లాడారు. రైతులతో టమోటా, ప్రత్తి, ఉల్లి, అరటి పంటల ధరల పతనం పై రైతులతో ముఖాముఖి చర్చలు, నిర్వహించబడ్డాయి. రాయలసీమ కళా సాంస్కృతిక బృందం, ప్రజా కళా సమితి వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. బహుమతులు గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయడమైనది.


Read More
Next Story