అనకాపల్లి జిల్లాలో భూకంపం: భయాందోళనలో రాంబిల్లి!
x

అనకాపల్లి జిల్లాలో భూకంపం: భయాందోళనలో రాంబిల్లి!

అనకాపల్లి జిల్లాలో భూప్రకంపనలు: అర్ధరాత్రి వీధుల్లోకి పరుగులు తీసిన జనం


అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ భూమి కంపించింది. ఒక్కసారిగా వచ్చిన భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:05 గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి.
రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.7గా నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు. రాంబిల్లి మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.
ఏం జరిగింది?
నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా శబ్దం వస్తూ భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. పాత్రలు పడటం, కిటికీలు ఊగడంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనం వీధుల్లోకి వచ్చారు. అయితే, ఈ ప్రకంపనల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.
భూప్రకంపనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయాందోళన చెందవద్దని అధికారులు కోరుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.
Read More
Next Story