మదనపల్లి: తుపాకులు చూపించి ఏటీఎం అపహరణ
రూ. 13.5 లక్షలు చోరీ చేసిన నలుగురు సభ్యుల ముఠా..
అది మదనపల్లె పట్టణం. శనివారం వేకువజామున సుమారు మూడు గంటలు. జనం అప్పుడప్పుడే నిద్ర నుంచి మేల్కొని వీధుల్లోకి వస్తున్నారు. మదనపల్లె పట్టణం నుంచి తిరుపతి మార్గంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద ఓ దొంగల గ్యాంగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( State Bank of India ) ఏటీఎంలో చోరీకి ప్రయత్నిస్తుండడం గమనించారు. అడ్డగించిన వారిని తొపాకులతో బెదిరించి, ఏకంగా ఏటిఎం యంత్రాన్నే ఎత్తుకుపోయారు. ఈ ఘటన వివరాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తెల్లవారుజామున 4.30 గంటలకు ఏటీఎం యంత్రాన్ని బొలేరో వాహనంలో తరలించుకుపోయారు.
సాంకేతికంగా గాలింపు
యంత్రం ధ్వంసం. నగదు గల్లంతు..
మదనపల్లె పట్టణంలో చోరీ చేసిన ఏటీఎం యంత్రాన్ని బొలేరో వాహనంలో నిమ్మనపల్లె మండలం అగ్రహారం సమీపంలో ధ్వంసం చేసి, అందులోని నగదుతో పరారీ అయినట్టు పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించారు. అడవిలాంటి ప్రదేశంలో వాల్మీకిపురం, నిమ్మనపల్లె మధ్య ఉన్న మోట్ల చేరువుకు సమీపంలో దుండగులు పడేసిన ఏటీఎం యంత్రం విడిభాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, నలుగురు సభ్యుల ముఠా కోసం డ్రోన్లు, పోలీసు సిబ్బందితో గాలింపు ముమ్మరం చేశారు.

