ఈ ఫ్యామిలీ ఫ్యామిలీదంతా సెక్స్ వ్యాపారమే!
x

ఈ ఫ్యామిలీ ఫ్యామిలీదంతా 'సెక్స్' వ్యాపారమే!

కుమారుడి ' సెక్స్ వ్యాపారానికి' తల్లీ, మేనమామ సహకారం, ఇన్ స్టా 'రీల్' వెనుక దాగిన భయంకర 'రియల్' స్టోరీ!


నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమంతా అరచేతిలో ఉన్నట్లే. కానీ అదే స్మార్ట్‌ఫోన్ కొన్నిసార్లు ప్రాణసంకటంగా మారుతోంది. రంగురంగుల రీల్స్, విలాసవంతమైన కార్లు, ఖరీదైన జీవనశైలిని చూపిస్తూ మైనర్ బాలికలను ట్రాప్ చేస్తున్న ఓ కిరాతక ముఠా ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కథనంలో విస్తుపోయే విషయం ఏమిటంటే, ఓ కుమారుడు చేస్తున్న అరాచకాలకు కన్నతల్లి, మేనమామ అండగా నిలవడమే.

ఈ కుటుంబమే ఓ గ్యాంగ్..

ఈ అరాచక పర్వానికి సూత్రధారి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలం చలమలమూడికి చెందిన కోడూరి చంద్రశేఖర్‌ ఆజాద్‌ అలియాస్‌ అర్జున్. ఇతను తన సోదరుడు రాజీవ్ తో కలిసి హైదరాబాద్‌ను వేదికగా చేసుకుని ఈ నెట్‌వర్క్ నడిపించాడు.

సోషల్ మీడియా వేదికగా సంపన్న కుటుంబాల మైనర్ బాలికలను ట్రాప్ చేసి, వారిని లైంగికంగా వేధించడమే కాకుండా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ఒక ప్రమాదకరమైన ముఠా ఆటను జూబ్లీహిల్స్ పోలీసులు కట్టడి చేశారు. ఈ దారుణమైన నేరంలో ప్రధాన నిందితుడికి అతని కన్నతల్లి, మేనమామ, సోదరుడు అండగా నిలవడం సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్ వరకు..
ఈ కేసులో ప్రధాన నిందితుడు కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలం, చలమలమూడికి చెందినవాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే వ్యామోహంతో ఇతను హైదరాబాద్‌ను వేదికగా చేసుకుని ఈ అరాచకాలకు తెరలేపాడు.
వీళ్లు ఎలా ట్రాప్ చేస్తారంటే...
నిందితుడు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో లగ్జరీ కార్లు, ఖరీదైన దుస్తులతో రీల్స్ చేస్తూ తానొక పెద్ద స్టార్టప్ కంపెనీ యజమానిగా ప్రచారం చేసుకునేవాడు. ఆ రీల్స్‌ను లైక్ చేసిన సంపన్న కుటుంబాల బాలికలను గుర్తించి వారితో స్నేహం చేసేవాడు. ప్రేమ పేరుతో నమ్మించి, వారిని ఖరీదైన కార్లలో తిప్పుతూ లైంగిక దాడులకు పాల్పడేవాడు. ఆ సమయంలో వారికి తెలియకుండా ఏకాంతంగా ఉన్న ఫోటోలు, వీడియోలు చిత్రీకరించేవాడు.
ఆ తర్వాత బ్లాక్ మెయిల్...
ఆ వీడియోలను చూపిస్తూ బాలికలను భయపెట్టి, వారి ఇళ్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ బాలిక తన ఇంట్లో తెలియకుండా ఏకంగా రూ. 13 లక్షలు తెచ్చి నిందితుడికి ఇచ్చినట్లు విచారణలో తేలింది.

పోలీసుల విచారణలో ఈ నేర సామ్రాజ్యం వెనుక కుటుంబ సభ్యుల పాత్ర స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు వసూలు చేసిన సొమ్మును అతని తల్లి మీనాకుమారి, మేనమామ తరక ప్రశాంత్ తమ ఖాతాల్లో జమ చేసుకునేవారు.
అర్జున్ సోదరుడు రాజీవ్ కూడా ఈ ట్రాపింగ్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించాడు. వీరితో పాటు విజయవాడకు చెందిన వినీల్ చౌదరి, జగద్గిరిగుట్టకు చెందిన జితేందర్, కే.సముద్రానికి చెందిన ఎన్. హేమంత్ నిందితులకు సహకరించేవారు.
అరెస్టుల పర్వం...
బాధిత కుటుంబాల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ప్రధాన నిందితుడి తల్లి మీనాకుమారి, మేనమామ ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రమేయమున్న సరస్వతి, నిషాంత్, శ్రీజిత్ అనే వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
ఈ ఘటన సోషల్ మీడియా యుగంలో పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎంతటి నిఘా ఉంచాలో తెలియజేస్తోంది. అపరిచితుల స్నేహానికి ఆకర్షితులై మైనర్లు తమ జీవితాలను, కుటుంబ గౌరవాన్ని పణంగా పెట్టవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Read More
Next Story