రాష్ట్ర ఉత్సవంగా మారిన చంద్రబాబు పుట్టిన రోజు..
x
అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దంపతులకు శ్రీవారిని పోలిన విగ్రహాన్ని బహూకరిస్తున్న టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి.

రాష్ట్ర ఉత్సవంగా మారిన చంద్రబాబు పుట్టిన రోజు..

అమరావతిలో చంద్రబాబు దంపతులకు శ్రీవారి ఆశీర్వచనాలు. అనంతపురంలో వినూత్న కార్యక్రమం.


రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలను టీడీపీ శ్రేణులు మహా ఉత్సవాన్ని తలపించేలా నిర్వహించాయి. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి సారధ్యంలో వెళ్లిన తిరుమల శ్రీవారి ఆలయ వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరికి వేదాశీర్వచనాలు అందించారు.

టీడీపీ శ్రేణులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ పండుగను తలపించేలా సామాజికసేవా కార్యక్రమాలను నిర్వహించాయి. ఊరూర రక్తదాన శిబిరాలు నిర్వహించారు. రక్తం నిలువలు స్థానిక ఆస్పత్రుల్లో పేద రోగులకు అత్యవసర సమయంలో వాడాలని సూచించారు.


టిటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో టిటిడి తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు సోమవారం ఉదయం అమరావతికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరికి శ్రీవారి దివ్య ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం బహూకరించారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో టిటిడి అర్చకులు వేదమంత్రాల నడుమ ఘనంగా వేదాశీర్వచనం నిర్వహించారు. టిటిడి అదనపు ఈఓ సి.హెచ్. వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ, ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.

76 కు సూచికగా..


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 76 వ పుట్టినరోజుకు సూచికగా అనంతపురం జిల్లాలో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే రోజు రూ.76కోట్లతో అభివృద్ధి పనులకు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు.

అన్నదానానికి రూ.44 లక్షల విరాళం


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరుకు చెందిన భాష్యం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ బి. రామకృష్ణ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఒక్కరోజు శ్రీవారి అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు విరాళంగా అందించారు. ఆదివారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, టీటీడీ అన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈఓ రాజేంద్రకు విరాళం డిడిని దాత అందజేశారు.

Read More
Next Story