
మంత్రి లోకేష్ కు పార్టీలో పదోన్నతి
టీడీపీ వర్కింగ్ ప్రెసిడింగ్ గా నియామకం..
తిరుపతి పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రికి పదోన్నతి లభించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ నారా లోకేష్ కు బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు టీటీడీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కమిటీలను పునర్వ్యస్థీకరించారు. టీడీపీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను కూడా ప్రకటించారు.
తిరుపతిలో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించడానికి రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. తెల్లవారిన తరువాత లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కిన విషయాన్ని పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు చెప్పడం ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. కష్టపడి పనిచేయం, విధేయతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. సీనియర్లకు గౌరవం, కొత్తవారికి అవకాశాలు, సామాజిక కోణం కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Next Story

